అసలే హిట్ ఇమేజ్..ఆపై క్రేజీ ప్రాజెక్ట్!

Posted By: Staff


అసలే హిట్ ఇమేజ్..ఆపై క్రేజీ ప్రాజెక్ట్!

 

కంప్యూటింగ్ గ్యాడ్జెట్ల నిర్మాణంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ కలిగి ఉన్న కంపెనీ లెనోవో. తాజాగా ఈ సంస్థ విండోస్ 8 ప్లాట్‌ఫామ్ పై పనిచేసే  టాబ్లెట్ పీసీని వృద్ధి చేసింది. ఈ డివైజ్ పేరును లెనోవో వర్గాలు ఇంకా ఖరారు చెయ్యలేదు. అసస్, ఏసర్, ఎమ్ఎస్ఐ వంటి ప్రముఖ బ్రాండ్‌లు వివిధ వేరియంట్‌లలో విండోస్ 8  టాబ్లెట్ కంప్యూటర్లను ఈ వారం లాంచ్ చేసిన విషయం తెలిసిందే. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు లెనోవో ఈ కంప్యూటింగ్ డివైజ్‌ను ప్రఖ్యాత బ్రాండ్ థింక్‌ప్యాడ్ కింద విడుదల చేస్తుంది. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే...

9.7 అంగుళాల మందం,

స్లిమ్,

10 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

ఇంటెల్ క్లోవర్ ట్రెయిల్ ప్రాసెసర్,

10 గంటల బ్యాటరీ బ్యాకప్ (కేవలం సింగిల్ చార్జ్‌తో ),

ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలతో కూడిన కెమెరాలు పీసీ ముందు వెనుక భాగాల్లో అమర్చారు,

మైక్రో హెచ్‌డిఎమ్ఐ సౌలభ్యత,

డాకింగ్ కనెక్టర్,

ధర అంచనా రూ.45,000.

శక్తివంతమైన ల్యాప్‌టాప్‌ లెనోవో ధింక్‌ప్యాడ్ టీ430:

గ్యాడ్జెట్ ప్రియులకు సుపరిచితమైన కంప్యూటర్ల తయారీ బ్రాండ్ లెనోవో మరో శక్తివంతమైన ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది. పేరు లెనోవో ధింక్ ప్యాడ్ టీ430. ఈ డివైజ్‌కు సంబంధించిన ఫీచర్లు బహిర్గతం కావటంతో లెనోవో యూజర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేగవంతమైన కంప్యూటింగ్ ను ఉత్పత్తి చేసే  విధంగా శక్తివంతమైన  22ఎన్ఎమ్ ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్లను ఈ ల్యాపీలో నిక్షిప్తం చేశారు. ఇతర కీలక ఫీచర్లను పరిశీలిస్తే….

14 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్,

డ్యూయల్ కోర్ ఇంటెల్ కోర్ ఐ5-3210 ప్రాసెసర్,

6జీబి మెమెరీ,

4 ఇన్ 1 కార్డ్ రీడర్,

500జీబి హార్డ్ డ్రైవ్,

హై డెఫినిషన్ వెబ్‌క్యామ్,

6 సెల్ బ్యాటరీ,

1333మెగాహెడ్జ్ డీడీఆర్3 ర్యామ్,

ఐంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్స్,

హై డెఫినిషన్ కెమెరా,

యూఎస్బీ కనెక్టువిటీ,

హైడెఫినిషన్ మైక్రోఫోన్స్,

వై-ఫై,

జిగాబిట్ ఇతర్ నెట్

లెనోవో థింక్ ప్యాడ్ టీ4320 ఉత్తమమైన డిస్‌ప్లే స్ర్కీన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో అమర్చిన కెమెరా ఉత్తమ క్వాలిటీతో కూడిన ఫోటోలను చిత్రీకరిస్తుంది. ల్యాపీలో నిక్షిప్తం చేసిన మల్టీ బర్నర్ ఫీచర్ ఆప్టికల్ DVD±RW మన్నికైన పనితీరు ప్రదర్శిస్తుంది. పొందుపరిచిన వెబ్‌క్యామ్‌తో ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు.  డివైజ్ ఈ జూన్‌లో అందుబాటులోకి రానుంది. ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot