‘లీపాన్’ ప్లాన్ అదిరింది.. సక్సెస్ ఖాయమేనా..?

Posted By: Prashanth

‘లీపాన్’ ప్లాన్ అదిరింది.. సక్సెస్ ఖాయమేనా..?

 

టాబ్లెట్ మార్కెట్ విస్తరిస్తున్న నేపధ్యంలో కొత్త ఉత్పాదక సంస్థలు ఈ సెగ్మెంట్ వైపు ఆసక్తి కనబరుస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో మన్నికైన ఫీచర్లను జోడించి యూజర్ ఫ్రెండ్లీ టాబ్లెట్‌లను ఈ సంస్థలు రూపొందింస్తున్నాయి. ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన నూతన బ్రాండ్ ‘లీపాన్’ తాను డిజైన్ చేసిన టాబ్లెట్ పీసీలను ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా విక్రియిస్తుంది. ఈ ఏడు నిర్వహిస్తున్న ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’లో లీప్యాడ్ యూజర్ ఫ్రెండ్లీ బడ్జెట్ టాబ్లెట్‌లను ఆవిష్కరించనుంది.

ఈ బ్రాండ్ నుంచి ఉత్తమ మోడల్‌గా వస్తున్న ‘లీపాన్ III’ టాబ్లెట్ ఉపయుక్తమైన ఫీచర్లతో బలిష్టంగా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ 4.1 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ రన్ అవుతుంది. శక్తివంతమైన డ్యూయల్ కోర్ TI OMAP 4460 ప్రాసెసర్‌ను సిస్టంలో నిక్షిప్తం చేశారు. ప్రాసెసర్ క్లాక్ వేగం 1.5 GHz, 1జీబి ర్యామ్, కనెక్టువిటీ వ్యవస్థను బలోపేతం చేస్తూ బ్లూటూత్ వర్షన్ 4.0 అప్లికేషన్, మైక్రోకార్డ్ స్లాట్ ద్వారా మెమరీని పెంచుకునే సౌలభ్యత. తెలియని ప్రాంతాలను సులువుగా నావిగేట్ చేసేందుకు టాబ్లెట్‌లో జీపీఎస్ సపోర్ట్‌ను ఏర్పాటు చేశారు, ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థను బలోపేతం చేస్తూ మన్నికైన మీడియా ప్లేయర్‌ను గ్యాగ్జెట్‌లో నిక్షిప్తం చేశారు.

లీపాన్ నుంచి వస్తున్న మరో టాబ్లెట్ ‘TC978’. డివైజ్ ఆండ్రాయిడ్ వర్షన్ హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను ఈ పరికరంలో నిక్షిప్తం చేశారు. 1జీబి ర్యామ్. ఈ టాబ్లెట్ పీసీల డిస్‌‌ప్లే ఫీచర్లుకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. సమంజసమైన ధరలకే ఈ గ్యాడ్జెట్లను అందిస్తామని లీపాన్ వర్గాలు స్ఫష్టం చేసినట్లు సమాచారాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot