Home
Computer

ల్యాప్‌టాప్ పర్ఫార్మెన్స్ పెంచాలా.. ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసమే!

Level Up Laptop: ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగులు, స్టూడెంట్స్ ల్యాప్‌టాప్ పైన బాగా ఆధారపడుతున్నారు. అయితే అవి స్లో అవడం సహజం. కొత్తవి కొనాలంటే చాలానే డబ్బులు అవుతాయి. నిజానికి కొత్త ల్యాప్‌టాప్ కొనవలసిన అవసరం లేదు. ల్యాప్‌టాప్ స్పీడ్‌గా పనిచేయాలంటే కొన్ని అప్‌గ్రేడ్స్ చేయాలి, అలాగే కొన్ని ఈజీ టెక్నిక్స్ పాటించాలి. ఈ ఆర్టికల్‌లో అవేవో తెలుసుకుందాం. అంతేకాకుండా మంచి క్వాలిటీ, ఫీచర్లతో బడ్జెట్-ఫ్రెండ్లీ బెస్ట్ ల్యాప్‌టాప్స్ గురించి తెలుసుకుందాం.

* RAM పెంచాలి

చాలా ల్యాప్‌టాప్స్‌లో 4GB లేదా 8GB RAM ఉంటుంది. ఇది చిన్నపాటి పనులకు ఓకే కానీ, 16GBకి అప్‌గ్రేడ్ చేస్తే మల్టీ టాస్కింగ్ సూపర్ ఫాస్ట్‌గా ఉంటుంది. ఒకేసారి చాలా ప్రోగ్రామ్స్ వాడేవాళ్లకి లేదా హెవీ యాప్స్ యూజ్ చేసేవాళ్లకి ఈ అప్‌గ్రేడ్ బాగా హెల్ప్ చేస్తుంది.

Level Up Your Laptop  Simple Upgrades for Better and Faster Performance

* హార్డ్ డ్రైవ్ ప్లేస్‌లో SSD పెట్టాలి

సాధారణ హార్డ్ డ్రైవ్ (HDD) బదులు సాలిడ్-స్టేట్ డ్రైవ్ (SSD) వాడితే ల్యాప్‌టాప్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. SSD వల్ల ల్యాప్‌టాప్ వెంటనే స్టార్ట్ అవుతుంది, ఫైల్స్ ఫాస్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతాయి, యాప్స్ కూడా చకచకా ఓపెన్ అవుతాయి. అంతేకాదు, SSD తక్కువ పవర్ తీసుకుంటుంది, ఎక్కువ కాలం పనిచేస్తుంది.

* బ్యాటరీ అప్‌గ్రేడ్ చేయాలి

మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ తొందరగా అయిపోతుంటే, కొత్త బ్యాటరీ వేయించుకుంటే లైఫ్ మారిపోతుంది. మంచి నాణ్యమైన కొత్త బ్యాటరీతో మీ ల్యాప్‌టాప్ లైఫ్ పెరుగుతుంది, ఒకసారి ఛార్జ్ చేసుకుంటే ఎక్కువ సేపు యూజ్ చేయొచ్చు. కొత్త బ్యాటరీ వల్ల ల్యాప్‌టాప్ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

* ల్యాప్‌టాప్‌ని క్లీన్, గ్రాఫిక్స్ కార్డ్ అప్‌గ్రేడ్

దుమ్ము, డస్ట్ పార్టికల్స్ కూలింగ్ సిస్టమ్‌లో చేరితే ల్యాప్‌టాప్ వేడెక్కి స్లో అయిపోతుంది. రెగ్యులర్‌గా ల్యాప్‌టాప్‌ని క్లీన్ చేస్తే ఈ ప్రాబ్లం రాకుండా స్మూత్‌గా పనిచేస్తుంది. గేమ్స్ ఆడినా లేదా వీడియోలు ఎడిట్ చేసినా, గ్రాఫిక్స్ కార్డ్ అప్‌గ్రేడ్ చేస్తే పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. కానీ ఇది డెడికేటెడ్ గ్రాఫిక్స్ ఉన్న ల్యాప్‌టాప్స్‌కి మాత్రమే సాధ్యం.

* సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

ఆపరేటింగ్ సిస్టమ్, డ్రైవర్స్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. అప్‌డేట్స్‌లో బగ్స్ ఫిక్స్ చేస్తారు, స్పీడ్ కూడా పెరుగుతుంది. థర్డ్ పార్టీ స్టోర్స్ లేదా వెబ్‌సైట్స్‌ నుంచి సాఫ్ట్‌వేర్స్‌ డౌన్‌లోడ్ చేసుకోకూడదు. అలా చేస్తే వైరస్ వంటివి సిస్టమ్‌లోకి ప్రవేశించి పర్ఫామెన్స్‌ను స్లో చేయొచ్చు.

* బెస్ట్ బడ్జెట్-ఫ్రెండ్లీ పోర్టబుల్ ల్యాప్‌టాప్స్

ఖర్చు తక్కువైనా అదిరిపోయే ఫీచర్లతో ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే మీకోసం కొన్ని బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ పోర్టబుల్ ల్యాప్‌టాప్స్ ఇక్కడ ఉన్నాయి. రోజువారీ పనుల నుండి మొదలుకొని స్టైలిష్ డిజైన్ వరకు, అన్ని రకాల అవసరాలకు సరిపోయే ల్యాప్‌టాప్‌లు ఈ లిస్టులో ఉన్నాయి.

ముఖ్యంగా స్టూడెంట్స్, బేసిక్ యూసేజ్ కోసం చూస్తున్న వాళ్లకి లెనోవో V15 ఒక మంచి ఆప్షన్. ఇది 15.6-ఇంచ్ HD డిస్‌ప్లే, ఇంటెల్ సెలెరాన్ N4020 ప్రాసెసర్, 4GB ర్యామ్, 256GB SSD స్టోరేజ్‌తో వస్తుంది. బ్రౌజింగ్, డాక్యుమెంట్స్ ఎడిటింగ్ వంటి పనులకు ఇది బెస్ట్. ఇది లైట్‌వెయిట్ అయినా అంత స్ట్రాంగ్ మాత్రం కాదు.

వర్క్, స్టడీస్ కోసం చూస్తున్న వాళ్లకి HP 250 G8 ల్యాప్‌టాప్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది 15.6-ఇంచ్ ఫుల్ HD డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, 8GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్‌తో వస్తుంది. దీంతో మీరు మీ వర్క్, స్టడీస్ ని స్మూత్‌గా చేసుకోవచ్చు.

ప్రొడక్టివిటీ, సెక్యూరిటీ ఫీచర్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్లకి లెనోవో థింక్‌ప్యాడ్ E14 బెస్ట్ ఆప్షన్. ఇది 14-ఇంచ్ ఫుల్ HD డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 8GB ర్యామ్, 256GB SSD స్టోరేజ్‌తో వస్తుంది. అయితే ఇది గేమింగ్, వీడియో ఎడిటింగ్‌కి అంతగా సెట్ అవ్వదు.

బిజినెస్, పర్సనల్ యూస్ కోసం చూస్తున్న వాళ్లకి డెల్ ఇన్‌స్పిరాన్ 5630 ఒక సూపర్ ఆప్షన్. ఇది 14-ఇంచ్ ఫుల్ HD డిస్‌ప్లే, 13th Gen ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 8GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి.

ప్రీమియం ఫీచర్స్, స్టైలిష్ డిజైన్ కావాలనుకునే వాళ్లకి యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (2022) ఒక అద్భుతమైన ఛాయిస్. ఇది 13.3-ఇంచ్ రెటినా డిస్‌ప్లే, యాపిల్ M1 చిప్ విత్ 8-కోర్ CPU, 8GB ర్యామ్, 256GB SSD స్టోరేజ్‌తో వస్తుంది. కాకపోతే మిగతా ల్యాప్‌టాప్స్‌తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ ధర ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Upgrade your laptop for better performance with simple steps like RAM and SSD upgrades. Clean your laptop and update software. Consider budget-friendly laptops for various needs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X