చిన్నారులకు స్పెషల్.. విడుదల సెప్టంబర్ 15!

Posted By: Prashanth

చిన్నారులకు స్పెషల్.. విడుదల సెప్టంబర్ 15!

 

చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన లెక్సీబుక్ టాబ్లెట్లు సెప్టంబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా లభ్యం కానున్నాయి. ఈ పీసీలో ముందస్తుగా 200 ఈ-పుస్తకాలను లోడ్ చేశారు. నిక్షిప్తం చేసిన ఎడ్యుకేషన్ ల్ అప్లికేషన్స్ వివిధ పఠ్యాంశాల పై అవగాహన కలగిస్తాయి. ఇవి కాకుండా డివైజ్‌లో లోడ్ చేసిన 25 ప్రత్యేక గేమ్స్ ఉత్కంఠత నిండిన గేమింగ్ అనుభూతులను చేరువచేస్తాయి. పీసీలో అమర్చిన కెమెరా ఉత్తమ క్వాలటీ ఫోటోగ్రఫీని అందిస్తుంది. లోడో చేసిన ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఫోటో ఎడిటింగ్ నైపుణ్యాలకు మరింత సానపెడుతుంది.

వై-ఫై కనెక్టువిటీ సౌలభ్యతలో హైస్పీడ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను చిన్నారులు ఆస్వాదించవచ్చు. పేరంటల్ లాక్ సిస్టం సౌలభ్యత కలదు. లెక్సీబుక్ మార్కెట్ స్టోర్ ద్వారా 10,000 వరకు అప్లికేషన్‌ల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ధరకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఫ్రాన్స్ దేశానికి చెందిన లెక్సీబుక్ సంస్థ టాబ్లెట్‌లకు సంబంధించి అనేకమైన ఉపకరణాలను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు 41 దేశాల్లో 500 ఉత్పత్తులను బ్రాండ్ విక్రయిస్తోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting