మూడు డిఫరెంట్ స్టైల్స్!!

Posted By: Staff

మూడు డిఫరెంట్ స్టైల్స్!!

 

ప్రతిష్టాత్మక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదికగా ఎల్‌జీ ప్రకటించిన గ్లాసెస్ ఫ్రీ 3డి టాబ్లెట్ ఎక్స్‌నోట్ ఏ540 - హెచ్ ల్యాప్‌టాప్ పలువురి ద్ళష్గిని ఆకర్షించింది. ఈ నేపధ్యంలో ఎల్‌జీ ఇదే సిరీస్ నుంచి రెండు భిన్న వేరియంట్‌లలో ల్యాపీలను డిజైన్ చేసింది. ఎక్స్‌నోట్  - A540-P,ఎక్స్‌నోట్ A540 T/Dగా రూపుదిద్దుకున్న ఈ  కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లు ప్రత్యేక 2డి వ్యవస్థను కలిగి ఉంటాయి.

ఎక్స్‌నోట్ సిరీస్ నుంచి వస్తున్న ల్యాపీల ప్రధాన ఫీచర్లు:

-    15.6 అంగుళాల స్ర్కీన్,

-    జీఫోర్స్ జీటీ555ఎమ్ గ్రాఫిక్ కార్డ్,

-    ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్,

-    ఎస్‌ఆర్ఎస్ ప్రీమియమ్ సౌండ్ (5.1 సౌండ్ అవుట్ పుట్),

-    ఇంటిగ్రేటెడ్ వెబ్ క్యామ్,

వీటిలో టాప్ మోడల్ గా ఉన్న  ఏ540 - హెచ్ అత్యాధునిక ఆటోస్టిరియోస్కోపిక్ 3డి డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. మరో వేరియంట్  ఎక్స్‌నోట్  A540-P ఏహెచ్-ఐపీఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి 2డి విజువల్స్‌ను మాత్రమే విడుదల చేస్తుంది. చివరి మోడల్ ఎక్స్‌నోట్  A540-T/Dలో  ప్రత్యేక 3డి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన కళ్లద్దాల సాయంతో 3డి విజువల్స్‌ను వీక్షించాల్సి ఉంటుంది.

ఈ ల్యాపీలన్నింటిలో శక్తివంతమైన ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్లను నిక్షిప్తం చేశారు.  అదేవిధంగా పొందుపరిచిన జీఫోర్స్ జీటీ555ఎమ్ గ్రాఫిక్  వ్యవస్థ  హై రిసల్యూషన్‌తో కూడిన మల్టీమీడియా అనుభూతులను చేరువచేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఈ ల్యాపీల విడుదల మరియు ధరలు వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot