‘3డీ’ వినోదంలో కొత్త అధ్యయనానికి ‘ఎల్‌జీ’ యత్నం!!

Posted By: Super

‘3డీ’ వినోదంలో కొత్త అధ్యయనానికి ‘ఎల్‌జీ’ యత్నం!!

భారతీయ ఎలక్ట్రానిక్ వస్తు పరిశ్రమలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న ఎల్‌జీ(LG) నవ నూతన టెక్ సాంకేతికతకు అద్దం పడుతుంది. ‘3డీ’వినోదంలో సరికొత్త శకానికి ‘ఎల్‌జీ’ నాంది పలకనుంది. అత్యాధునిక ‘3డీ’ అనుభూతులను మరింత చేరువచేస్తూ ‘LG A520 3D’ ల్యాపీని మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. వినియోగదారుడికి సంతృప్తినందించే ఆడ్వాన్సడ్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లను గ్యాడ్జెట్లో పొందుపరిచారు.

గ్యాడ్జెట్లో పొందుపరిచిన విండోస్ 7 ప్రొఫెషనల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, 15.6 అంగుళాల హై డెఫినిషన్ 3డీ LED LCD డిస్‌ప్లే, 750జీబీ హార్డ్ డ్రైవ్, న్విడియా గ్రాఫిక్స్ మెమరీ, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజి, 4GB DDR3 ర్యామ్ వంటి అంశాలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

5-in-1 మల్టీ మీడియా కార్డ్ స్లాట్, 802.11 b/g/n వై-ఫై , అత్యాధునిక బ్లూటూత్ కనెక్టువిటీ అంశాలు సమాచార సరఫరాను మరింత వేగవంతం చేస్తాయి. సెక్యూరిటీ ఫీచర్లలో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఫింగర్ ప్రింట్ రీడర్’ వ్యవస్థ వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తుంది.

ప్రత్యేక ఫీచర్లను పరిశీలిస్తే ‘unique LED’ ఇండికేటర్, ఆటోమెటిక్ 2D to 3D కన్వర్షన్, 3డీ సరౌండ్ సౌండ్, 1.3 మెగా పిక్సల్ వెబ్ క్యామ్, 6 సెల్ లితియమ్ బ్యాటరీ వ్యవస్థలు గ్యాడ్జెట్ పటిష్టతను మరింత పెంచుతాయి. భారతీయ మార్కెట్లో ‘LG A520 3D’ ల్యాపీ రేంజ్ రూ.55,000 నుంచి 60, 000 మధ్య ఉండోచ్చని తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot