‘డెల్’ గొప్పదా.. ‘ఎల్‌జీ’ గొప్పదా.?

By Super
|
LG A530

‘‘దిగ్గజ శ్రేణులు ‘డెల్’, ‘ఎల్‌జీ’ల మధ్య గ్యాడ్జెట్ల పోరు మొదలైంది. అంతర్జాతీయ ల్యాప్‌టాప్‌ల మర్కెట్లను వశం చేసుకునేందుకు ఈ ప్రముఖ బ్రాండ్లు వ్యూహరచన చేస్తున్నాయి. తమ తమ ప్రణాళికల్లో భాగంగా ఎల్జీ సరికొత్త 3డీ నోటుబుక్ పరికరాన్ని మార్కెట్లో విడుదల చేసేందుకు కసరత్తులు షూరూ చేసింది. తానేమి తక్కువ తినలేదన్నట్లుగా ‘డెల్’ సాంకేతికతకు కొత్తదనాన్ని జోడించి డెల్ ఇన్సిపిరాన్ ల్యాప్‌టాప్ పరికరాలను మార్కెట్లో విడుదల చేసింది...’’

ఈ పరికరాల్లోని ముఖ్య ఫీచర్లు క్లుప్తంగా:

ఎల్‌జీ A530 (LG A530): 3డీ వ్యవస్థతో రూపొందించిన ఈ నోటుబుక్ పరికరం 3డీ చిత్రాలతో పాటు వీడియోలను నాణ్యమైన 3డీ అనుభూతిలో మీకు అందిస్తుంది. అత్యాధునిక సెకండ్ జనరేషన్ ప్రొసెసింగ్ ఆప్లికేషన్లను ఈ పరికరంలో ఏర్పాటు చేశారు. గ్రాఫిక్స్ వ్యవస్థను సమర్థవంతంగా నడిపించేందుకు వీలుగా సాండీ బ్రిడ్జి కోర్ i7 ఆడ్వాన్సడ్ ప్రొసెసింగ్ యూనిట్‌ను ఉపయోగించారు. 3డీ అనుభూతలు మరింత మైమరిపించేందకు 2జీబీ మెమరీ సామర్థ్యం గల న్విడియా జీఫోర్స్ జీటీ 555M సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు.

15.6 అంగుళాల డిస్‌ప్లే సామర్ధ్యం, 4జీబీ ఎస్‌ఎస్‌డీ, అదనంగా 750 హెచ్‌డీడీ వంటి అంశాలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. 3డీ క్రయోషన్ సామర్ధ్యం గల ఫ్రంట్, బ్యాక్ డ్యూయల్ కెమెరాలు 3డీ అనూభూతితో కూడిన వీడియోలతో పాటు నాణ్యమైన చిత్రాలను అందిస్తాయి. బ్లూరే, ఇతర్ నెట్, వై - ఫై, బ్లూటూత్, v3.0 యూఎస్బీ‌పోర్ట్సు వంటి అత్యాధినిక అంశాలు మెరుగైన పనితీరు కలిగి ఉంటాయి. త్వరలో విడుదల కాబోతున్న ఎల్‌జీ A530 3డీ నోట్‌బుక్ ధర రూ.43,000/- ఉండోచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

డెల్ ఇన్సిపిరాన్ ఆర్ ల్యాప్‌టాప్ (Dell Inspiron R Laptop): సరికొత్త విండోస్ 7 ఆధారితంగా రూపుదిద్దుకున్న ఇన్సిపిరాన్ ఆర్ సరీస్ ల్యాప్‌టాప్ లు ఇండియన్ మార్కెట్లో గొప్ప క్రేజును సంపాదించుకున్నాయి. సెకండ్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రొసెసర్లు ఈ ల్యాపీలకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ గ్యాడ్జెట్లలో పొందుపరిచిన గ్రాఫిక్ యాక్సిలరోమీటర్ గ్రాఫిక్ వ్యవస్థను పటిష్టపరుచుతుంది. ర్యామ్ సైజును 6జీబీ నుంచి హెచ్ డీడీ సాయంతో 750జీబీకి వృద్థి చేసుకోవచ్చు. డీవీడీ, ఆర్‌డబ్ల్యూ వంటి ఆప్టికల్ డ్రైవ్‌లను లాపీలలో పొందుపరిచారు.

17.3 అంగుళాల సామర్ధ్యం కలిగిన డిస్‌ప్లే పై 900 పిక్సల్ హై డెఫినిషన్ అనుభూతితో కూడిన లైవ్ స్ట్రీమింగ్ వీడియోలను తిలకించవచ్చు. అదనంగా పొందు పరిచిన వైమ్యాక్స్ (WiMAX) ఫీచర్ 4జీ వ్యవస్థకు సహకరిస్తుంది. మరో హై డెఫినిషన్ వ్యవస్థ విడీ (WiDi) వీడియాలతో పాటు చిత్రాలను తిలకించే సందర్భాల్లో థియోటర్ అనుభూతిని మీకు కల్పిస్తుంది. బ్లూ రే, వై - ఫై, బ్లూటూత్, యూఎస్బీ పోర్ట్సు వంటి అత్యాధినిక అంశాలు మెరుగైన పనితీరును కలిగి ఉంటాయి బ్యాటరీ అంశాలను పరిశీలస్తే 6 సెల్ లియాన్ బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలిక మన్నికను కలిగి ఉంటుంది. 2.55 కేజీల బరువు ఉండే ఈ ల్యాపీల ధర రూ.34,000 నుంచి మొదలవుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X