ఆ మడతే.. ఫ్లాట్ చేసేస్తుంది!!

Posted By: Staff

ఆ మడతే.. ఫ్లాట్ చేసేస్తుంది!!

 

పల్చని పొరతో కూడిన LCDలను రూపొందించటంలో ఎల్‌జీడి (ఎల్‌జీ డిస్‌ప్లే) సంస్థ క్రియాశీలక పాత్రపోషిస్తోంది. తాజాగా ఈ బ్రాండ్ తొలి ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ పేపర్ డిస్‌ప్లే (ఇపీడీ)లను ఇ-బుక్స్ కోసం తయారు చేసింది. ఈ - ఇంక్ ఆధారిత ఎలక్ట్రానిక్ పేపర్ డిస్‌ప్లే పరిమాణం 6 అంగుళాలు. రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్. ఈ సరికొత్త ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే ఈ-బుక్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తేనుందని విశ్లేషకుల అంచనా.

ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేలను రానున్న ఈ-బుక్ రీడర్లలో ఉపయోగించనున్నారు. ఈ డిస్‌ప్లే ఆధారిత గ్యాడ్జెట్‌లు వచ్చే నెల నుంచి యూరప్‌లో లభ్యం కానున్నాయి. ఈ సరికొత్త డిస్‌ప్లే పేపర్‌లో చదివిన అనుభూతిని మీకు కలిగిస్తుంది. ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే‌ను 40డిగ్రీల వరకు వంచవచ్చు. అంతేకాదండోయ్. ఈ డిస్‌ప్లే కిందపడినా పెద్ద ప్రమాదమేమి ఉండదు. కంటి రుగ్మతలను తగ్గిస్తుంది. తక్కువ విద్యుత్‌ను ఖర్చుచేస్తుంది. ధర కూడా తక్కువే.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot