తక్కువ బరువు తో, LG కొత్త Laptop లు లాంచ్ అయ్యాయి! ధర,స్పెసిఫికేషన్లు
LG సంస్థ తన సరికొత్త ల్యాప్‌టాప్‌లను భారతదేశంలో గ్రామ్ 2023 సిరీస్ పేరుతో పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో LG గ్రామ్ 2023, గ్రామ్ స్టైల్, గ్రామ్ 2 ఇన్ 1 మరియు LG అల్ట్రా PC వంటి వివిధ వెర్షన్‌లు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లన్నీ విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ప్రీలోడ్ చేయబడి ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్ లు SSD స్టోరేజీ, 17 అంగుళాల వరకు డిస్‌ప్లేలు మరియు 65W వద్ద ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 80Wh బ్యాటరీ వంటి ఫీచర్లను అందిస్తాయి.
భారతదేశంలో LG గ్రామ్ 2023 సిరీస్ ల్యాప్‌టాప్‌ల ధర
LG గ్రామ్ 2023 సిరీస్ ల్యాప్‌టాప్‌లు భారతదేశంలో ఈ క్రింది విధంగా ఉన్నాయి. 14 అంగుళాల LG గ్రామ్ 2023 ల్యాప్‌టాప్ ధర రూ. 1,27,000 నుండి ప్రారంభమవుతుంది, అయితే పెద్ద గ్రామ్ 16 మరియు గ్రామ్ 17 ప్రారంభ ధర రూ. 1,42,990. LG గ్రామ్ స్టైల్ ధర రూ. 1,42,990, LG గ్రామ్ 2 ఇన్ 1 ప్రారంభ ధర రూ. 2,05,000 మరియు LG అల్ట్రా PC ప్రారంభ ధర రూ. 1,04,000 గా ఉంది.

LG గ్రామ్ 2023 సిరీస్ ల్యాప్‌టాప్ యొక్క స్పెసిఫికేషన్‌లు
LG గ్రామ్ 2023 సిరీస్ వివరాలు చూస్తే, ఇది LPDDR5 6000 MHz RAM మరియు Gen.4 NVMe (x2) స్టోరేజ్‌తో పాటు Intel EVO సర్టిఫైడ్ 13వ జెన్ కోర్ ప్రాసెసర్‌తో అమర్చబడి ఉంది. ఈ ల్యాప్‌టాప్ దాని వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 16:10 WQXGA డిస్‌ప్లే, DCI-P3 99% కలర్ రీప్రొడక్షన్ మరియు 400నిట్స్ బ్రైట్‌నెస్‌తో యాంటీ గ్లేర్ IPS డిస్‌ప్లేతో వస్తుంది. ఇది కాల్ మరియు మెసేజ్ ట్రాన్స్‌మిషన్ కోసం మొబైల్‌లో ఇంటెల్ యునిసన్ మరియు LG సింక్‌ను కలిగి ఉంది, అలాగే LG సెక్యూరిటీ గార్డ్, LG గ్లాన్స్ బై మిరామెట్రిక్స్ మరియు ఫేస్ లాగిన్ ఫీచర్‌లను కూడా కలిగి ఉంది.
LG గ్రామ్ స్టైల్ యొక్క ఫీచర్లు గమనిస్తే, ఈ ల్యాప్‌టాప్ 2880 x 1800 పిక్సెల్‌ల రిజల్యూషన్, 16:10 యాస్పెక్ట్ రేషియో మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 14-అంగుళాల WQXGA+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్, 16GB వరకు LPDDR5 RAM మరియు 512GB NVMe SSD స్టోరేజీ అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 తో పనిచేస్తుంది. మరియు డాల్బీ అట్మాస్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 72Wh బ్యాటరీ కలిగి ఉంది.
LG గ్రామ్ 2-in-1 ల్యాప్‌టాప్ యొక్క ఫీచర్లు చూస్తే, ఇది 16 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది మరియు ఇది ల్యాప్‌టాప్ మరియు టాబ్లెట్ మోడ్‌ల మధ్య మారడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అంటే దీనిని మీరు ల్యాప్‌టాప్ మరియు టాబ్లెట్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది 13వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్, 32GB LPDDR5 RAM మరియు 2TB NVMe Gen4 SSD స్టోరేజీ ను కలిగి ఉంది. ఇది విండోస్ 11 హోమ్‌లో రన్ అవుతోంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 80Wh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








