యూజర్స్ కోసం బక్కపలుచని ల్యాప్ టాప్స్‌ని ప్రవేశపెట్టిన ఎల్‌జీ

Posted By: Super

యూజర్స్ కోసం బక్కపలుచని ల్యాప్ టాప్స్‌ని ప్రవేశపెట్టిన ఎల్‌జీ

ఇండియన్ మార్కెట్లో ఎల్‌జీ ఉత్పత్తలు నమ్మకానికి మారు పేరు. అటువంటి ఎల్‌జీ కంపెనీ నుండి ఏ ఉత్పత్తి విడుదలైన కస్టమర్స్ వాటిమీద ప్రత్యేకమైన ఆసక్తిని, శ్రద్దను కనబరుస్తూ ఉంటారు. మార్కెట్లోకి ఎల్‌జీ ఉత్పత్తులు సేల్స్ రికార్డుని చూస్తేనే తెలిసిపోతుంది దాని సామర్ద్యం. కస్టమర్స్ యొక్క నాడిని పసిగట్టి ప్రత్యేకంగా వారి కొసం మార్కెట్లోకి రెండు కొత్త ల్యాప్ టాప్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. వాటి పేర్లు ఎల్‌జీ పి430, ఎల్‌జీ పి530. ఎల్‌జీ విడుదల చేయనున్న రెండు ల్యాప్ టాప్‌లు కూడా చూడడానికి స్లిమ్‌గా ఉండి, హై ఎండ్ ఫీచర్స్‌ని కలిగి ఉన్నాయి.

ఇంత వరకు మార్కెట్లో ఎల్‌జీ విడుదల చేసిన ల్యాప్ టాప్స్‌తో గనుక పోల్చుకుంటే ఈ రెండు చాలా తక్కువ బరువుని కలిగి ఉన్నాయని తెలిపారు. మార్కెట్లో వేరే ల్యాప్ టాప్స్‌తో గనుక వీటిని పొల్చితే ఎల్‌ఈడి, ఎల్‌సిడి డిస్ ప్లేతో 47శాతం స్లిమ్‌గా ఉంటాయని అన్నారు. ఎల్‌జీ పి430 బరువు సుమారుగా 1.94 కేజీ ఉండగా, ఎల్‌జీ పి530 బరువు సుమారుగా 2.24 కేజీగా రూపోందించడం జరిగింది. ఇక దీనియొక్క డిజైన్ విషయానికి వస్తే బ్రిలియంట్ మెటాలిక్ డిజైన్‌తో పాటు, అల్యూమినియమ్ కలర్‌తో పాటుగా, డైమండ్ కట్ ఎడ్జిలతో చూడగానే ఆకట్టుకునే విధంగా రూపోందించడం జరిగింది.

అంతేకాకుండా ఇందులో రూపొందించిన Insert Mold Technology (IMT) టెక్నాలజీ సహాయంతో ల్యాప్ టాప్‌కి ఎటువంటి స్క్రాచ్‌లు, గీతలు పడకుండా ఉపయోగపడుతుంది. రెండు ల్యాప్ టాప్‌లలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీటిని DLNA (Digital Living Network Alliance), Wi-Di (Wireless Display) టెక్నాలజీలను సపోర్ట్ చేస్తాయి. ఇతర డివైజెస్‌ని కనెక్ట్ చేసుకునేందుకు గాను ఇందులో ఉన్న కనెక్టివిటీ ఫచర్ ఉపయోగపడుతుంది.

ఇక ఎల్‌జీ పి430, పి530 రెండు ల్యాప్ టాప్‌లను కూడా ఎల్‌జీ బ్లేడ్ సిరిస్‌లో విడుదల చేయనున్నారు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను పి430 ల్యాప్ టాప్ డిస్ ప్లే సైజు 4.5 ఇంచ్, పి530 ల్యాప్ టాప్ డిస్ ప్లే సైజు 4.7 ఇంచ్‌గా రూపోందించడం జరిగింది. రెండు ల్యాప్ టాప్‌ల ఫెర్పామెన్స్ ఫాస్ట్‌గా ఉండేందుకు గాను సెకండ్ జనరేషన్ Core i7 ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. గ్రాఫికల్ సపోర్ట్ అధ్బుతంగా ఉండేందుకు గాను రెండింటిలోను GeForce GT520M Graphics accelerating unitని ఇమడింప జేయడం జరిగింది. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్ హెచ్‌‌ఎస్ పైక్ మాట్లాడుతూ మేము విడుదల చేయనున్న ఈ స్టలిష్ ల్యాప్ టాప్స్ అన్ని రకాల బిజినెస్‌లకు కూడా ఉపయోగించుకొవచ్చని అన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ధరను తెలియజేస్తాం అని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot