ఎల్‌జీ ఇక 4జీ!!

Posted By: Staff

ఎల్‌జీ ఇక 4జీ!!

 

అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్ ‘4జీ’తో నడిచే టాబ్లెట్ కంప్యూటర్‌ను ఎల్‌జీ డిజైన్ చేసింది. ఇందుకు అవసరమైన ఎల్‌టీఈ (LTE) టెక్నాలజీని ఈ డివైజ్‌లో పొందుపరిచింది. ‘ఎల్‌జీ ఆప్టిమస్ ప్యాడ్ ఎల్ టీఈ’గా వస్తున్న ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను ఒదిగి ఉంది.

టాబ్లెట్ ముఖ్య విశేషాలు:

* 8.9 అంగుళాల మల్టీ టచ్‌ హై డెఫినిషన్ డిస్‌ప్లే,

* గుగూల్ ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం,

* 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

* 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

* 1జీబి ర్యామ్,

* ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ 32జీబి,

* బరువు 497 గ్రాములు.

డివైజ్‌లో నిక్షిప్తం చేసిన LTE టెక్నాలజీతో నెట్ సర్ఫింగ్ మరింత వేగవంతంగా ఉంటుంది. హై డెఫినిష్ డిస్‌ప్లే విజువల్స్‌ను పూర్తి స్థాయి క్వాలిటీతో విడుదల చేస్తుంది. ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థ మీ జ్ఞాపకాలను మన్నికైన నాణ్యతతో పదిలపరుస్తుంది. ఇండియన్ మార్కెట్లో ‘ఎల్‌జీ ఆప్టిమస్ ప్యాడ్ ఎల్‌టీఈ’ ధర తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot