రసపట్టు పై కన్నేసిన ‘LG’..?

By Super
|
LG P430K

భారతీయ సాంకేతిక పరికరాల మార్కెట్ కీలక అమ్మకాలపై దృష్టి సారించిన ‘ఎల్ జీ’ ఆ దిశగా పావులు కదుపుతోంది. ‘ఎలక్ట్రానిక్’ పరికరాల పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా చెలరేగుతున్న ఈ దిగ్గజ బ్రాండ్ కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ల మార్కెట్లో అదే హావాను కొనసాగిస్తుంది.

ఆడ్వాన్సడ్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లతో LG ‘P430K’వర్షన్లో అత్యాధునిక ల్యాపీ పరికరాన్ని మార్కెట్లో విడుదల చేసింది. ‘టైటాన్ బ్లాక్ ఆల్యూమినియమ్ ఫినిష్’తో డిజైన్ కాబడ్డ ఈ గ్యాడ్జెట్ బాడీ ప్యానల్ ప్రొఫెషనల్ హోదాను సంతరించుకుంది.

- 14 అంగుళాల ‘హై డెఫినిషన్’ LED LCD డిస్ ప్లే, 1366*768 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది. నేటి తరం ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ ల్యాపీ బరువు కేవలం 1.9 కిలో గ్రాములు మాత్రమే.

- విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ వ్యవస్థను పరికరంలో లోడ్ చేశారు.

- వేగవంతమైన ఇంటెల్ కోర్ ‘i5-2410M’ ప్రాసెసింగ్ వ్యవస్థను ల్యాపీలో ఏర్పాటు చేశారు.

- గ్యాడ్జెట్లో పొందుపరిచిన ‘DLNA’ టెక్నాలజీ కనెక్టువిటీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది.

- పటిష్ట 4జీబీ ర్యామ్ , 500 జీబీ హార్డ్ డ్రైవ్ స్పెసిఫికేషన్లు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

- వై-ఫై 802.11 b/ g/ n, బ్లూ టూత్ కనెక్టువిటీ వ్యవస్థలు డేటాను వేగవంతంగా ట్రాన్సఫర్ చేస్తాయి.

-5-in-1 మల్టీ మీడియా కార్డును గ్యాడ్జెట్లో పొందుపరిచారు.

-‘SRS’ హై డెఫినిషన్ సౌండ్ టెక్నాలజీతో పాటు ‘డీవీడీ’ సూపర్ మల్టీ డ్రైవ్ ఫీచర్లు ఆడియో, వీడియో అంశాలను మరంత పటిష్టపరుస్తాయి.

- 1.3 మోగా పిక్సల్ కెమెరా, ఆడిషనల్ ఫీచర్లైన యూఎస్బీ పోర్ట్ప్, హెడీఎమ్ఐ పోర్ట్స్, LED ఫింగర్ ఫ్రింట్ టెక్నాలజీ అంశాలను ముందుగానే లోడ్ చేశారు.

- ఏర్పాటు చేసిన ‘6 సెల్ లితియమ్ బ్యాటరీ వ్యవస్థ’ దీర్ఘకాలీక బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

- ఈ గ్యాడ్జెట్ ధర మరియు ఇతర వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించాల్సి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X