రియలిస్టిక్ అనుభూతులతో LG అల్ట్రావైడ్ గేమింగ్ మానిటర్స్‌

భవిష్యత్ పీసీ గేమింగ్ విభాగంలో అల్ట్రావైడ్ గేమింగ్ మానిటర్స్ పాత్ర చాలా కీలకం కానుందని గేమింగ్ పరిశ్రమ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేసింది.

By Lekhaka
|

భవిష్యత్ పీసీ గేమింగ్ విభాగంలో అల్ట్రావైడ్ గేమింగ్ మానిటర్స్ పాత్ర చాలా కీలకం కానుందని గేమింగ్ పరిశ్రమ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేసింది. ప్రస్తతం అందుబాటులో ఉన్న స్టాండర్డ్ 16:9 మానిటర్స్ అలానే మల్టీ-స్ర్కీన్ సెటప్‌లతో పోలిస్తే అల్ట్రావైడ్ గేమింగ్ మానిటర్స్ అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి.

LG’s Ultrawide Gaming Monitors deliver unparalleled PC gaming experience

అల్ట్రావైడ్ గేమింగ్ మానిటర్స్‌లోని 21:9 యాస్పెక్ట్ రేషియో స్ర్కీన్స్ గ్రాఫికల్ కంటెంట్‌ను మరింత క్వాలిటీతో ఆఫర్ చేయగలుగుతాయి. స్టన్నింగ్ విజువల్స్‌తో కూడిన హైక్వాలిటీ గేమింగ్ అనుభూతులను ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునే గేమర్స్‌కు, ఈ అల్ట్రావైడ్ గేమింగ్ మానిటర్స్ అనేవి నూటికి నూరు శాతం బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి.

రూ. 89 వేల ఫోన్ సైతం out of stock, దుమ్మురేపిన ఆపిల్రూ. 89 వేల ఫోన్ సైతం out of stock, దుమ్మురేపిన ఆపిల్

డ్యుయల్ మానిటర్స్ అలానే మల్టీ-స్ర్కీన్ లేఅవుట్స్ ఆఫర్ చేయలేని ఫీల్డ్ ఆఫ్ వ్యూను అల్ట్రావైడ్ గేమింగ్ మానిటర్స్‌ ఆఫర్ చేయగలుగుతాయి. మీరు ఇప్పటికీ స్టాండర్డ్ 16:9 యాస్పెక్ట్ రేషియో మానిటర్స్ ద్వారానే గేమింగ్‌ను ఆస్వాదిస్తున్నట్లయితే, రియాలాస్టిక్ అనుభూతులతో కూడిన సీరియస్ గేమింగ్‌ను మిస్ అవుతున్నట్లే!

నోకియా ఫోన్లకు ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ !నోకియా ఫోన్లకు ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ !

అల్ట్రావైడ్ గేమింగ్ మానిటర్స్‌ ద్వారా పీసీ గేమింగ్ ఎక్స్‌పిీరియన్స్‌ను సెటప్ చేసుకోవాలనుకుంటోన్న యూజర్లు ముందుగా ఈ మానిటర్స్ గురించి పూర్తిగా తెలుసుకోవల్సి ఉంది. అల్ట్రావైడ్ గేమింగ్ మానిటర్స్‌‌ను అభివృద్ధి చేస్తోన్న ప్రముఖ బ్రాండ్‌లలో ఎల్‌జీ ఒకటి. ఈ బ్రాండ్ ఆఫర్ చేస్తున్న మానిటర్స్ అనేక బెస్ట్ క్వాలిటీ ఫీచర్లతో వస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బెటర్‌ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం అల్ట్రావైడ్ మానిటర్స్ బెస్ట్ ఛాయిస్

బెటర్‌ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం అల్ట్రావైడ్ మానిటర్స్ బెస్ట్ ఛాయిస్

గేమింగ్ అనేది పూర్తిగా విజువల్స్ పై ఆధారపడి ఉంటుంది. గేమింగ్ నిమిత్తం వినియోగిస్తోన్న 16:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లేలో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకు మార్పులు చోటుచేసుకున్నప్పటికి, లేటెస్ట్ గేమింగ్ స్టాండర్డ్స్‌కు మాత్రం ఈ డిస్‌ప్లేలు సరిపోవటం లేదు.

ప్రస్తుత గేమింగ్ స్టాండర్డ్స్‌ను అందుకోవాలంటే స్టన్నింగ్ విజువల్స్‌తో పాటు హైగ్రాఫికల్ కంటెంట్‌ను డిస్‌ప్లే చేయగలిగే అల్ట్రావైడ్ మానిటర్ మీ వద్ద ఉండి తీరాల్సిందే. గేమ్‌ప్లే సమయంలో ఈ అల్ట్రావైడ్ డిస్‌ప్లేలు ఆఫర్ చేసే ఫీల్డ్ ఆఫ్ వ్యూతో మొత్తం గేమింగ్ కంటెంట్‌ను మీ కళ్ల ముందు కనబుడుతుంది.

ఎల్‌జీ 34యూ79జీ, ఎల్‌జీ 29యూఎమ్6

ఎల్‌జీ 34యూ79జీ, ఎల్‌జీ 29యూఎమ్6

అల్ట్రావైడ్ డిస్‌ప్లే క్యాటగిరి విభాగంలో LG అందుబాటులోకి తీసుకువచ్చిన 34UC79G మోడల్ మానిటర్ బెస్ట్ క్లాస్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ మానిటర్‌లో ఏర్పాటు చేసిన AH-IPS అల్ట్రావైడ్ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్‌తో 2560 x 1080 పిక్సల్స్ రిసల్యూషన్ క్వాలిటీని ఆఫర్ చేస్తోంది.

32 అంగుళాల స్ర్కీన్‌తో వస్తోన్న ఈ మానిటర్‌లో కాంట్రాస్ట్ రేషియో 1000:1 గాను, యాస్పెక్ట్ రేషియో 21:9గాను ఉంది. డిస్‌ప్లే పై అమర్చిన ఐపీఎస్ ప్యానల్ 16.7 మిలియన్ల రంగులతో కూడిన వైడ్ స్పెక్ట్రమ్‌ను కవర్ చేయటంతో పాటు 8-బిట్ రీప్రొడక్షన్‌కు అనుమతిస్తుంది.

గేమ్‌ప్లే అవుతున్నప్పుడు ఈ మానిటర్‌ స్ర్కీన్ హైట్‌తో పాటు టిల్ట్‌ను కావల్సిన విధంగా ఎడ్జస్ట్ చేసుకునే వీలుంటుంది. ఈ వైడ్ స్ర్కీన్ మానిటర్‌లో వేరియబుల్ రీఫ్రెష్ రేట్ 50 నుంచి 144Hz మధ్య ఉంటుంది. 165 Hz రేట్ దగ్గర ఓవర్‌క్లాక్ అవుతుంది. రీఫ్రెస్ రేట్ పెరిగేకొద్ది విజువల్ అవుట్‌పుట్ మరింతగా మెరుగుపడుతూ వస్తుంది.

అల్ట్రావైడ్ డిస్‌ప్లే క్యాటగిరి విభాగంలో LG అందుబాటులోకి తీసుకువచ్చిన మరో మానిటిర్ LG 29UM69. 29 అంగుళాల డిస్‌ప్లే ప్యానల్‌తో వస్తోన్న ఈ 21:9 అల్ట్రావైడ్ గేమింగ్ మానిటర్‌కు ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ సౌకర్యం కూడా ఉంది.

ఈ ప్యానల్ 16.7 మిలియన్ల రంగులతో కూడిన వైడ్ స్పెక్ట్రమ్‌ను కవర్ చేయటంతో పాటు 75Hz రీఫ్రెష్ రేట్ అలానే 1000:1 కాంట్రాస్ట్ రేషియోను కలిగి ఉంటుంది. కస్టమ్, రీడర్, ఫోటో, కెమెరా వంటి మల్టిపుల్ పిక్షర్ మోడ్స్ ఈ మానిటర్‌లో ఉన్నాయి. 1ms మోషన్ బ్లర్ రిడక్షన్, అడాప్టివ్ సింక్ టెక్నాలజీతో పాటు అడ్వాన్సుడ్ గేమింగ్ ఫీచర్లు ఈ మానిటర్ లో ఉన్నాయి.

కట్టింగ్ ఎడ్జ్ డిస్‌ప్లే టెక్నాలజీ...

కట్టింగ్ ఎడ్జ్ డిస్‌ప్లే టెక్నాలజీ...

మార్కెట్లో అనేక కంపెనీలకు సంబంధించి అల్ట్రావైడ్ మానిటర్స్ అందుబాటులో ఉన్నప్పటికి, అవి ఎల్‌జీ మానిటర్స్‌కు సాటిరావు. ఎల్‌జీ కంపెనీ ఆఫర్ చేస్తోన్న అల్ట్రావైడ్ మానిటర్స్ అత్యుత్తమ గేమ్‌ప్లేకు అసవరమైన లేటేస్ట్ డిస్‌ప్లే టెక్నాలజీలను కలిగి ఉన్నాయి.

ఈ మానిటర్స్‌లో పొందుపరిచిన అడాప్టివ్ సింక్ టెక్నాలజీ గ్రాఫిక్స్ కార్డ్ ఫ్రేమ్ రేట్ అలానే మానిటర్స్ రీఫ్రెష్ రేట్‌లను ఖచ్చితంగా బ్యాలన్స్ చేస్తూ హైక్వాలిటీ అవుట్‌పుట్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. FreeSync టెక్నాలజీ అవాంతరాలు లేని గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

1ఎమ్ఎస్ మోషన్ బ్లర్ రిడక్షన్ అండ్ 144Hz రీఫ్రెష్ రేట్

1ఎమ్ఎస్ మోషన్ బ్లర్ రిడక్షన్ అండ్ 144Hz రీఫ్రెష్ రేట్

స్మూత్ గేమ్ ప్లేకు మానిటర్ రెస్పాన్స్ టైమ్ అనేది చాలా కీలకం. ఎల్‌జీ ఆఫర్ చేస్తోన్న అల్ట్రావైడ్ మానిటర్స్‌లో 1ఎమ్ఎస్ మోషన్ బ్లర్ రిడక్షన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా గేమ్‌ప్లేను మరింత స్మూత్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసే వీలుంటుంది. ఎల్‌జీ అల్ట్రా వైడ్ స్ర్కీన్స్, గేమర్ ఏకాగ్రతను పెంపొందించటంతో పాటు మరింత ఖచ్చితత్వంతో పనిచేస్తాయి.

ఇంటెన్సివ్ గేమింగ్ సెషన్స్‌లో తలత్తే మోషన్ బ్లర్‌ను తగ్గించేందుకు ఎల్‌జీ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ దోహదపడుతుంది. బ్లాక్‌ లైట్ బ్లింకింగ్ ఎఫెక్ట్‌తో ఈ టెక్నాలజీ ఉత్పత్తి చేసే బ్లాక్ ఇమేజ్ ఇన్సర్షన్, ఇంటెన్సివ్ గేమింగ్ సెషన్స్‌లో తలత్తే మోషన్ బ్లర్ ను నిరోధిస్తుంది. ఎల్‌జీ ఆఫర్ చేస్తున్న కట్టింగ్ ఎఢ్జ్ టెక్నాలజీతో గ్రాఫిక్స్ మరింత స్మూత్‌గా పనిచేస్తాయి.

 బ్లాక్ స్టెబిలైజర్ టెక్నాలజీతో డార్క్ స్ర్కీన్‌లోనూ డిటేల్స్ తెలుసుకోవచ్చు...

బ్లాక్ స్టెబిలైజర్ టెక్నాలజీతో డార్క్ స్ర్కీన్‌లోనూ డిటేల్స్ తెలుసుకోవచ్చు...

ఎల్‌జీ అల్ట్రావైడ్ మానిటర్స్ ఆఫర్ చేసే బ్లాక్ స్టెబిలైజర్ టెక్నాలజీ, మానిటర్ సెట్టింగ్స్‌ను వేగవంతంగా ఆప్టిమైజ్ చేయటంతో పాటు డార్క్ సీన్‌లలో సుపీరియర్ డిటేల్‌ను రివీల్ చేయగలుగుతుంది. గేమ్‌ప్లే సమయంలో ఈ ఫీచర్‌ను టర్న్ ఆన్ చేసుకున్నట్లయితే డార్క్ సీన్‌లలోని వివరాలను సైతం స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. ముఖ్యంగా యాక్షన్ గేమ్స్ ఆడుతోన్న సమయంలో ఈ ఫీచర్ మరింతగా ఉపయోగపడుతుంది.

Best Mobiles in India

English summary
LG’s Ultrawide Gaming Monitors deliver unparalleled PC gaming experience

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X