హైక్వాలిటీ గేమర్స్ కోసం LG 34UC79G మానిటర్

Posted By: BOMMU SIVANJANEYULU

అత్యుత్తమ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కోరుకునే వారికి సరైన గేమింగ్ ఎక్విప్‌మెంట్ అనేది చాలా అవసరం. ఈ నేపథ్యంలో గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ సరికొత్త గేమింగ్ మానిటర్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఎల్‌జీ 34యూసీ79జీ, ఎల్‌జీ 24జీఎమ్79జీ మోడల్స్‌లో ఈ గేమింగ్ మానిటర్‌లు అందుబాటులో ఉంటాయి.. 34 అంగుళాల స్ర్కీన్‌తో వస్తోన్న ఈ అల్ట్రా‌వైడ్ గేమింగ్ మానిటర్ ఏకంగా 21:9 యాస్పెక్ట్ రేషియోను క్యారీ చేస్తుంది.

హైక్వాలిటీ గేమర్స్ కోసం  LG 34UC79G మానిటర్

గేమింగ్ అనేది పూర్తిగా విజువల్స్ పై ఆధారపడి ఉంటుంది. గేమింగ్ నిమిత్తం వినియోగిస్తోన్న 16:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లేలో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకు మార్పులు చోటుచేసుకున్నప్పటికి, లేటెస్ట్ గేమింగ్ స్టాండర్డ్స్‌కు మాత్రం ఈ డిస్‌ప్లేలు సరిపోవటం లేదు. ప్రస్తుత గేమింగ్ స్టాండర్డ్స్‌ను అందుకోవాలంటే స్టన్నింగ్ విజువల్స్‌తో పాటు హైగ్రాఫికల్ కంటెంట్‌ను డిస్‌ప్లే చేయగలిగే అల్ట్రావైడ్ మానిటర్ మీ వద్ద ఉండి తీరాల్సిందే. గేమ్‌ప్లే సమయంలో ఈ ఎల్‌జీ 34యూసీ79జీ గేమింగ్ మానిటర్ ఆఫర్ చేసే ఫీల్డ్ ఆఫ్ వ్యూతో మొత్తం గేమింగ్ కంటెంట్‌ మీ కళ్ల ముందు కనబడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

50Hz టు 144Hz రీఫ్రెష్ రేట

సాంప్రదాయ గేమింగ్ మానిటర్‌లతో పోలిస్తే 21:9 యాస్పెక్ట్ రేషియోతో వచ్చే గేమింగ్ మానిటర్‌లు బెస్ట్ క్వాలిటీ గ్రాఫికల్ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేయగలుగుతాయి. గేమింగ్ అవసరాలను బట్టి అల్ట్రా‌వైడ్ గేమింగ్ మానిటర్‌ను కొనుగోలు చేయవల్సి వస్తే ఎల్‌జీ 34యూసీ79జీ మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

32 అంగుళాల స్ర్కీన్‌తో వస్తోన్న ఈ మానిటర్‌లో కాంట్రాస్ట్ రేషియో 1000:1 గాను, యాస్పెక్ట్ రేషియో 21:9గాను ఉంది. డిస్‌ప్లే పై అమర్చిన ఐపీఎస్ ప్యానల్ 16.7 మిలియన్ల రంగులతో కూడిన వైడ్ స్పెక్ట్రమ్‌ను కవర్ చేయటంతో పాటు 8-బిట్ రీప్రొడక్షన్‌కు అనుమతిస్తుంది.

గేమ్‌ప్లే అవుతున్నప్పుడు ఈ మానిటర్‌ స్ర్కీన్ హైట్‌తో పాటు టిల్ట్‌ను కావల్సిన విధంగా ఎడ్జస్ట్ చేసుకునే వీలుంటుంది. ఈ వైడ్ స్ర్కీన్ మానిటర్‌లో వేరియబుల్ రీఫ్రెష్ రేట్ 50 నుంచి 144Hz మధ్య ఉంటుంది. రీఫ్రెష్ రేట్ 144Hzగా ఉన్నట్లయితే సెకనుకు 144 సార్లు డిస్‌ప్లే రీఫ్రెష్ కాబడుతుంది. దీంతో స్మూత్ గేమ్ ను ప్లేను యూజర్లు ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా ఫాస్ట్ ఫేసుడ్ యాక్షన్ గేమ్స్ ఆడుతున్న సమయంలో రీఫ్రెష్ రేట్ క్వాలిటీ మీకు అర్థమవుతుంది.

1ఎమ్ఎస్ మోషన్ బ్లర్ రిడక్షన్..

స్మూత్ గేమ్ ప్లేకు మానిటర్ రెస్పాన్స్ టైమ్ అనేది చాలా కీలకం. ఎల్‌జీ ఆఫర్ చేస్తోన్న 34యూసీ79జీ అల్ట్రావైడ్ మానిటర్‌లో 1ఎమ్ఎస్ మోషన్ బ్లర్ రిడక్షన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా గేమ్‌ప్లేను మరింత స్మూత్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసే వీలుంటుంది. బ్లాక్‌ లైట్ బ్లింకింగ్ ఎఫెక్ట్‌తో ఈ టెక్నాలజీ ఉత్పత్తి చేసే బ్లాక్ ఇమేజ్ ఇన్సర్షన్, ఇంటెన్సివ్ గేమింగ్ సెషన్స్‌లో తలత్తే మోషన్ బ్లర్‌ను నిరోధిస్తుంది.

ఎల్‌జీ ఆఫర్ చేస్తున్న కట్టింగ్ ఎఢ్జ్ టెక్నాలజీతో గ్రాఫిక్స్ మరింత స్మూత్‌గా పనిచేస్తాయి. ఇంటెన్సివ్ గేమింగ్ సెషన్స్‌లో తలత్తే మోషన్ బ్లర్‌ను తగ్గించేందుకు ఎల్‌జీ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ దోహదపడుతుంది. మానిటర్‌లోని మరో ఫీచర్ ఫ్రీ సింక్, ఫ్రేమ్ రేట్ అలానే రీఫ్రెష్ రేట్ లలోని తేడాల కారణంగా తలెత్తే షట్టరింగ్ ఎఫెక్ట్‌ను ఏ మాత్రం కనిపించకుండా ప్లేయర్స్‌కు హై-ఎండ్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

బీటా వెర్షన్ లో వాట్సాప్ కొత్త ఫీచర్లు ఇవే!

21:9 యాస్పెక్ట్ రేషియో

ఎల్‌జీ 34యూసీ79జీ గేమింగ్ మానిటర్ అత్యాధునిక ఏహెచ్-ఐపీఎస్ అల్ట్రావైడ్ డిస్‌ప్లేతో వస్తోంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోన్న ఈ డిస్‌ప్లే 2560 x 1080 పిక్సల్ రిసల్యూషన్‌ను క్యారీ చేస్తుంది. ఈ శక్తివంతమన డిస్‌ప్లే డ్యుయల్ మానిటర్స్ ఇంకా మల్టీ స్ర్కీన్ లేఅవుట్స్ ఆఫర్ చేయలేని ఫీల్డ్ ఆఫ్ వ్యూను ఆఫర్ చేయగలగుతుంది. 1000:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తోన్న ఈ స్ర్కీన్ హైక్వాలిటీ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

క్రాస్‌హెయిర్, బ్లాక్ స్టెబిలైజర్, డైనమిక యాక్షన్ సింక్

ఎల్‌జీ 34యూసీ79జీ మానిటర్ లో క్రాస్‌హెయిర్, బ్లాక్ స్టెబిలైజర్, డైనమిక యాక్షన్ సింక్ వంటి గేమింగ్ సెంట్రింక్ ఫీచర్లు ఉన్నాయి. షూటర్ గేమ్స్ ఆడుతున్న సమయంలో క్రాస్‌హెయిర్ ఫీచర్ స్ట్రైకింగ్ పాయింట్ ను ఖచ్చితమైన ప్లేస్ లో ఉంచుతుంది.

దీంతో గురి తప్పకుండా షూట్ చేసే వీలుంటుంది. మరో ఫీచర్ బ్లాక్ స్టెబిలైజర్ మానిటర్ సెట్టింగ్స్‌ను వేగవంతంగా ఆప్టిమైజ్ చేయటంతో పాటు డార్క్ సీన్‌లలో సుపీరియర్ డిటేల్‌ను రివీల్ చేయగలుగుతుంది. గేమ్‌ప్లే సమయంలో ఈ ఫీచర్‌ను టర్న్ ఆన్ చేసుకున్నట్లయితే డార్క్ సీన్‌లలోని వివరాలను సైతం స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. ముఖ్యంగా యాక్షన్ గేమ్స్ ఆడుతోన్న సమయంలో ఈ ఫీచర్ మరింతగా ఉపయోగపడుతుంది.

మరో ఫీచర్ డైనమిక్ యాక్షన్ సింక్ ద్వారా గేమర్స్ తమ ప్రత్యర్థులపై ఇన్ స్టెంట్ గా అటాక్ చేసే వీలుంటంది. సీరియస్ యాక్షన్ గేమ్స్ ఆడుతున్న సమయంలో ఈ ఫీచర్ దాదాపుగా ఇన్‌పుట్ ట్యాగ్స్‌ను తగ్గించివేస్తుంది. వీటితో పాటు గేమింగ్ మోడ్ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఆప్టిమల్ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ను యూజర్లు ఆస్వాదించే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG has come up with a new ultrawide gaming monitor – the LG 34UC79G for the gaming enthusiasts.The ultrawide gaming monitor from LG has a wider aspect ratio of 21:9 that lets gamers see beyond the blind spot. The LG ultrawide monitor features a variable refresh rate of 50Hz to 144Hz that adds to its highlights.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot