ఎల్‌జీ నుంచి విప్లవాత్మక గేమింగ్ మానిటర్

గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ సరికొత్త గేమింగ్ మానిటర్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఎల్‌జీ 34యూసీ79జీ మోడల్‌లో ఈ గేమింగ్ మానిటర్ అందుబాటులో ఉంటుంది. 34 అంగుళాల స్ర్కీన్‌తో వస్తోన్న ఈ అల్ట్రా‌వైడ్ గేమింగ్ మానిటర్ ఏకంగా 21:9 యాస్పెక్ట్ రేషియోను క్యారీ చేస్తుంది.

ఎల్‌జీ నుంచి విప్లవాత్మక గేమింగ్ మానిటర్

16:9 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉండే సాంప్రదాయ గేమింగ్ మానిటర్‌లతో పోలిస్తే 21:9 యాస్పెక్ట్ రేషియోతో వచ్చే గేమింగ్ మానిటర్‌లు బెస్ట్ క్వాలిటీ గ్రాఫికల్ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేయగలుగుతాయి. గేమింగ్ అవసరాలను బట్టి అల్ట్రా‌వైడ్ గేమింగ్ మానిటర్‌ను కొనుగోలు చేయవల్సి వస్తే ఎల్‌జీ 34యూసీ79జీ మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

21:9 యాస్పెక్ట్ రేషియో, 2560 x 1080 పిక్సల్ రిసల్యూషన్‌

ఎల్‌జీ 34యూసీ79జీ గేమింగ్ మానిటర్ అత్యాధునిక ఏహెచ్-ఐపీఎస్ అల్ట్రావైడ్ డిస్‌ప్లేతో వస్తోంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోన్న ఈ డిస్‌ప్లే 2560 x 1080 పిక్సల్ రిసల్యూషన్‌ను క్యారీ చేస్తుంది. ఈ శక్తివంతమన డిస్‌ప్లే డ్యుయల్ మానిటర్స్ ఇంకా మల్టీ స్ర్కీన్ లేఅవుట్స్ ఆఫర్ చేయలేని ఫీల్డ్ ఆఫ్ వ్యూను ఆఫర్ చేయగలగుతుంది. 1000:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తోన్న ఈ స్ర్కీన్ హైక్వాలిటీ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

144Hz రీఫ్రెష్ రేటుతో స్మూత్ రెండరింగ్

ఎల్‌జీ 34యూసీ79జీ గేమింగ్ మానిటర్ రీఫ్రెష్ రేటు 50Hz నుంచి 144Hz మధ్య ఉంటుంది. 165Hz వరకు ఓవర్ క్లాక్ అవుతుంది. రీఫ్రెష్ రేట్ పేరిగే కొద్ది విజువుల్ అవుట్‌పుట్‌ క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సాంప్రదాయ గేమింగ్ మానిటర్‌లు స్టాండర్డ్ 60Hz రీఫ్రెష్ రేటును కలిగి ఉన్నాయి. వీటితో పోలిస్తే ఎల్‌జీ 34యూసీ79జీ గేమింగ్ మానిటర్ అడ్వాన్సుడ్ రీఫ్రెష్ రేటును కలిగి ఉంది. ఈ మానిటర్‌లో నిక్షిప్తం చేసిన ఐపీఎస్ ప్యానల్ 16.7 మిలియన్ కలర్స్‌తో కూడిన వైడ్ స్పెక్ట్రమ్‌ను కవర్ చేస్తుంది. అంతేకాకుండా 8-బిల్ కలర్ రీప్రొడక్షన్‌ను అనుమతిస్తుంది.

మోషన్ బ్లర్, స్ర్కీన్ స్ప్లిట్ 2.0, అడాప్టివ్ సింక్ టెక్నాలజీ

ఎల్‌జీ 34యూసీ79జీ గేమింగ్ మానిటర్‌లో మోషన్ బ్లర్ రిడక్షన్, ఆన్‌స్ర్కీన్ కంట్రోల్స్ విత్ స్ర్కీన్ స్ప్లిట్ 2.0, అడాప్టివ్ సింక్ టెక్నాలజీ ఇంకా అడ్వాన్సుడ్ గేమింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ మానిటర్‌లో పొందుపరిచిన డైనమిక్ యాక్షన్ సింక్ టెక్నాలజీ ఎటువంటి అంతరాయాలు లేకుండా రియల్ టైమింగ్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా ఇన్‌పుట్ లాగ్స్‌ను ఈ ఫీచర్ నిరోధిస్తుంది. ఎల్‌జీ 34యూసీ79జీ గేమింగ్ మానిటర్‌లోని 1ఎమ్ఎస్ రెస్పాన్స్ టైమ్ బ్లర్రింగ్ ఇంకా గోస్టింగ్‌ను రెడ్యూస్ చేసి అల్టిమేట్ స్మూత్ గేమింగ్‌ను ఆఫర్ చేస్తుంది.

డార్క్ స్ర్కీన్‌లోనూ క్లారిటీ డిటెయిల్స్ ...

ఎల్‌జీ అల్ట్రావైడ్ మానిటర్స్ ఆఫర్ చేసే బ్లాక్ స్టెబిలైజర్ టెక్నాలజీ, మానిటర్ సెట్టింగ్స్‌ను వేగవంతంగా ఆప్టిమైజ్ చేయటంతో పాటు డార్క్ సీన్‌లలో సుపీరియర్ డిటేల్‌ను రివీల్ చేయగలుగుతుంది. గేమ్‌ప్లే సమయంలో ఈ ఫీచర్‌ను టర్న్ ఆన్ చేసుకున్నట్లయితే డార్క్ సీన్‌లలోని వివరాలను సైతం స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. ముఖ్యంగా యాక్షన్ గేమ్స్ ఆడుతోన్న సమయంలో ఈ ఫీచర్ మరింతగా ఉపయోగపడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG's wide screen monitors offer latest and best display technology for immersive game play. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot