‘ఎల్‌జీ’ సరికొత్త ఆవిష్కరణ ‘షురికేన్ 18’

Posted By: Super

‘ఎల్‌జీ’ సరికొత్త ఆవిష్కరణ ‘షురికేన్ 18’


ఎల్‌జీ సరికొత్త ఆవిష్కరణ ‘అల్ట్రాబుక్’ సంబంధిత సమాచారం లీకై షికార్లు చేస్తుంది. భారీ అంచనాల మధ్య తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ గ్యాడ్జెట్ పరికరం పోటీ బ్రాండ్లైన ఆసర్, తోషిబాలకు ధీటుగా నిలబడేందుకు శక్తివంతమైన ఫీచర్లను తనలో నింపుకుంటుంది. ప్రస్తుత గ్యాడ్జెట్ల మార్కెట్లో వినియోగదారులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న అల్ట్రాబుక్ పరికరాలు వివిధ కాన్ఫిగరేషన్లలో లభ్యమవుతున్నాయి.

- ఎల్‌జీ విడుదల చేయుబోతున్న అల్ట్రాబుక్ ఫీచర్లకు సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ‘ఎల్ జీ షురికేన్ 18’ (LG Shuriken Eighteen)గా ఈ అల్ట్రాబుక్‌కు నామకరణం చేసినట్లు తెలుస్తోంది.
- 13.3 అంగుళాల డిస్‌ప్లే, చిక్‌లెట్ స్టైల్ కీబోర్డు వంటి అంశాలు అల్ట్రాబుక్‌ను మరింత అందంగా తీర్చిదిద్దుతాయి.
- అనుసంధానించిన ఇంటెల్ ‘Ivy’ బ్రిడ్జి ప్రొసెసింగ్ వ్యవస్థ గ్యాడ్జెట్ పనితీరును సమర్ధవంతంగా సమీక్షిస్తుంది.
- వై - ఫై, బ్లూటూత్ వంటి వ్యవస్థలు సమాచారాన్ని మరింత పటిష్టతం చేస్తాయి.
- డేటా స్టోరేజి అంశాలకు సంబంధించి 2జీబీ ర్యామ్‌ను పరికరంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
- త్వరలో విడుదల కాబోతున్న ఎల్‌జీ అల్ట్రాబుక్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot