'ఎల్‌జీ' మజాకా చూదము రారండి..!!

Posted By: Prashanth

'ఎల్‌జీ' మజాకా చూదము రారండి..!!

 

ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ఎల్‌జీ కంపెనీ ఆల్ట్రా బుక్ ప్యామిలీకి చేరింది. ప్రస్తుతం కంప్యూటర్ ప్రపంచంలో ఆసస్, ఏసర్ , లెనోవా లాంటి దిగ్గజాలు వాటి యొక్క మోడల్స్‌తో దూసుకపోతున్నాయి. వీటికి పోటీగా ఎల్‌జీ మార్కెట్లోకి ఆల్ట్రాబుక్ 'జడ్330'ని ప్రవేశపెట్టింది. ఈ మోడల్ ఎల్‌జీ ఎక్స్ నోట్ కేటిగిరి క్రింద విడుదల చేయనుంది.

'ఎల్‌జీ జడ్ 330' ఆల్ట్రాబుక్ ప్రత్యేకతలు:

* Super compact

* Light weight

* 13 inch display

* Intel’s second generation processor

* Bluetooth

* Wi-Fi

'ఎల్‌జీ ఆల్ట్రాబుక్ జడ్ 330' అధ్బుతమైన ఫీచర్స్‌తో కస్టమర్స్‌ని అలరించనుంది. ఎల్‌జీ ఆల్ట్రాబుక్ జడ్ 330 నోట్ బుక్ మందం 0.6 ఇంచ్‌లు. బరువు 1.22 కేజీలు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 13 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. ఎల్‌జీ ఆల్ట్రాబుక్ యూజర్స్‌కు రెండు రకాల ప్రాసెసర్స్‌ని అందించనున్నాయి.

యాజర్స్ యొక్క అభిరుచులను బట్టి 1.6 GHz Intel i5 ప్రాసెసర్ లేకపోతే 1.8GHz i7 ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇక హార్డ్ డిస్క్ కెపాసిటీ విషయానికి వస్తే 120 GB, 256 GB రెండింటిని కూడా అందుబాటులో ఉంచడం జిరిగింది. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ కోసం ప్రత్యేకంగా బ్లూటూత్, వై - పైలను సపోర్ట్ చేస్తుంది. మెమరీ కార్డులను రీడ్ చేసేందుకు గాను ఇందులో ప్రత్యేకంగా మైక్రో ఎస్‌డి కార్డు రీడర్‌ని అమర్చారు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 75, 000/- నుండి రూ 1, 00, 000/- వరకు ఉండవచ్చునని అంచనా.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot