మా కొత్త ప్రపంచంలోకి వస్తారా.. వింతలు చూపిస్తాం!!

Posted By: Super

మా కొత్త ప్రపంచంలోకి వస్తారా.. వింతలు చూపిస్తాం!!

‘‘ ఆ 3డీ ప్రపంచంలో అన్ని వింతలే.. సహజత్వానికి దగ్గరా ప్రత్యక్షంగా వీక్షించన అనుభూతి, నాణ్యమైన ప్రమాణాలతో ‘ఎల్ జీ Xnote A530’ పేరుతో సరికొత్త ల్యాపీని మార్కెట్లో విడుదలచేసుందుకు సన్నాహాలు చేస్తుంది. మరి మీరు సిద్ధమేనే ఆ వింత ప్రపంచంలో విహరించేందుకు.. ’’

సాంకేతిక పరికరాల ప్రపంచంలోకి తాజాగా ఎంటరైన ‘3డీ టెక్నాలజీ’ ప్రస్తుత మార్కెట్‌ను శాసిస్తుంది. సాంకేతిక పరికరాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ‘ఎల్ జీ’ 3డీ వ్యవస్థతో రూపొందించిన ‘Xnote A530’ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ డివైజ్‌లోని ప్రత్యేకతను గమనిస్తే 3డీ అనుభూతిని పొందేందుకు ఎటువంటి అదనపు హార్డ్‌వేర్‌ను పొందుపరచాల్సిన అవసరం లేదు.

హెచ్‌డీ ఎల్‌సీ‌డీ స్క్రీన్‌తో రూపుదిద్దుకున్న ‘ఎల్ జీ Xnote A530 ’ 15.6 అంగుళాల డిస్‌ప్లే సామర్థ్యం కలిగి ఉంది. సినిమాల్లో ఉపయోగించే రీటార్డర్ వ్యవస్థను ఇందులో పొందుపరిచారు. ఇంటెల్ సెకండ్ జనరేషన్ కోర్ i7 ప్రొసెస్సింగ్ వ్యవస్థ ఈ ల్యాపీలో దర్శనమిస్తోంది. 3డీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు న్విడియా జీఫోర్స్ జీటీ 555M వ్యవస్థను ఏర్పాటు చేశారు.

4జీబీ సాలిడ్ స్టేట్‌డ్రైవ్‌ను సపోర్టు చేసే 750 జీబీ సామర్ధ్యం కలిగిన హార్డ్‌డిస్క్ డ్రైవ్ మన్నికైన పనితీరును వినియోగదారునికి అందిస్తుంది. ‘ A530’లో పొందుపరిచిన రెండు ఇంటిగ్రేటడ్ వెబ్ క్యామ్‌లు నాణ్యమైన 2డీ, 3డీ చిత్రాలను చిత్రీకరిస్తాయి. ఈ ‘ల్యాపీ’లోని బోనస్ ఫీచర్లను పరశీలిస్తే ‘బ్లూ - రే కాంబో డ్రైవ్’ ఆడ్వాన్సడ్ స్పెసిఫికేషన్‌తో రూపొందించారు. అధునాతన కనెక్టువిటీ అంశాలైన 802.11 b/g/n WiFi, బ్లూటూత్, జిగాబిట్ ఇతర్‌నెట్ వంటి అంశాలు సమాచార వ్యవస్థను మరింత పటిష్టతం చేస్తాయి.

ఆడియో విషయానికి వస్తే ల్యాపీలో ఏర్పాటు చేసిన ‘3డీ ఎస్‌ఆర్‌ఎస్’ వ్యవస్ధ, మోడ్రన్ సెక్యూరిటీ అంశాలైన ఫింగర్ ఫ్రింట్, ఐడెంటిటీ సెట్‌అప్ వంటి అంశాలు భద్రతకు భరోసానిస్తాయి. 3డీ ఫోటోలతో పాటు, వీడియోలను నాణ్యమైన 3డీ స్క్రీన్ ద్వరా వీక్షించవచ్చు. యూజర్ ఫ్రెండ్లీగా సహకరించే ‘A530 ల్యాప్ టాప్’లు ప్రస్తుతం ఐరోపా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో ఈ నెలలో విడుదలకానుంది. అనంతరం దేశవ్యాప్తంగా వీటిని విడుదల చేస్తారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot