ప్రపంచపు జిరో సైజ్ బ్యూటీ!!

Posted By: Prashanth

ప్రపంచపు జిరో సైజ్ బ్యూటీ!!

 

ఒకప్పుడు నెట్‌బుక్‌లతో పాటు నోట్‌బుక్‌లకు మార్కెట్లో విపరీతమైన ఆదరణ ఉండేది. మారిన సమీకరణల నేపధ్యంలో వీటి స్థానాన్ని అల్ట్ర్రాబుక్ భర్తీ చేసింది. ల్యాప్‌టాప్ తరహాలో ఉండే ఈ కంప్యూటింగ్ డివైజ్‌ను పలు సంస్థలు ఇప్పటికే లాంఛ్ చేశాయి. ఇటీవల ఎల్‌జీ కంపెనీ రూపొందించిన LG X-Note Z330 Ultrabook జిరో సైజ్ నాజూకుతత్వాన్ని కలిగి పూర్తిస్థాయి కంప్యూటింగ్‌కు దోహదపడుతుంది.

అల్ట్రాబుక్ ఫీచర్లను పరిశీలిస్తే:

* 13.3 అంగుళాల హై డెఫినిషన్ ఎల్‌ఈడి బాక్‌లైట్ డిస్‌ప్లే ( స్ర్కీన్ రిసల్యూషన్ 1366*768పిక్సల్స్),

*   ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్,

*   విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ 64బిట్ ఆపరేటింగ్ సిస్టం,

*   4జీబి ర్యామ్,

* 256జీబి ఎస్ఎస్‌డి హార్డ్‌డిస్క్ డ్రైవ్,

*   బ్యాటరీ బ్యాకప్ 6 గంటలు,

*   హై డెఫినిషన్ వెబ్ కెమెరా,

*   హై డెఫినిషన్ ఆడియో,

*   హెచ్‌డిఎమ్ఐ అవుట్,

*   వై-ఫై (802.11 b/g/n),

*   బ్లూటూత్ 3.0, యూఎస్బీ కనెక్టువిటీ,

*   బరువు కేవలం 1కేజీ రెండు వందల గ్రాములు,

*   ధర రూ.80,000 (అంచనా).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot