టాబ్లెట్, స్మార్ట్ ఫోన్, కెమెరా, ల్యాప్‌టాప్‌లను కలుపుతూ ‘లైఫ్ బుక్’!!!

Posted By: Prashanth

టాబ్లెట్, స్మార్ట్ ఫోన్, కెమెరా, ల్యాప్‌టాప్‌లను కలుపుతూ ‘లైఫ్ బుక్’!!!

 

ప్రతినిత్యం వినూత్నకతకు పెద్ద పీటవేసే సొగసరి గ్యాడ్జట్ బ్రాండ్ ‘ఫుజిట్సు’(Fujitsu) మరో ఆవిష్కరణకు తెరలేపింది. టాబ్లెట్, స్మార్ట్ ఫోన్, కెమెరా, ల్యాప్‌టాప్ వంటి నాలుగు అత్యుత్తమ కమ్యూనికేషన్ మరియు కంప్యూటింగ్ వ్యవస్థలను ఒకే డివైజ్‌లో అనుసంధానం చేసుకునే విధంగా ‘లైఫ్‌బుక్’ను డిజైన్ చేసే యోచనకు ఫుజిట్సు తెరలేపింది.

ఈ ఆవిష్కరణకు సంబంధించిన పూర్తి సమచారాన్ని ‘యాంకో డిజైన్’ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. షేరింగ్ హార్డ్‌వేర్ టెక్నాలజీ, శక్తివంతమైన ప్రాసెసర్, బలిష్టమైన ర్యామ్, వ్యవస్థల పై ఈ ఆల్ ఇన్ వన్ డివైజ్ సమర్ధవంతంగా పనిచేసేందుకు తొడ్పడతాయని తెలుస్తోంది. 4 మేజర్ గ్యాడ్జెట్‌లను కలగలుపుతూ ఫుజిట్సు రూపొందింస్తున్న ‘ఫుజిట్సు లైఫ్ బుక్’ కాన్సెప్ట్ విజయవంతమై టెక్ పరిశ్రమలో మరో మైలు రాయిని అధిగమించాలని ఆశిద్దాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot