రెండు నిమిషాల తాజాదనంతో.. నిరంతర తాజాదనాన్ని సొంతం చేసుకోండి..!!

Posted By: Super

రెండు నిమిషాల తాజాదనంతో.. నిరంతర తాజాదనాన్ని సొంతం చేసుకోండి..!!

శీతల పానీయాల కంపెనీ కోకో.. కోలా ఇండియా తన వినియోగదారులను ఉత్సాహపరుస్తూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ‘‘ లిమ్కా దో పల్ తాజగీ హర్ గంటే టచ్ ప్యాడ్ ’’ (లిమ్కా తాగితే రెండే క్షణాల తాజాదనం, శ్యామ్ సంగ్ టచ్ ప్యాడ్ మీ వెంట ఉంటే ప్రతి గంటా తాజాదనం) అనే నినాదంతో లిమ్కా ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను లిమ్కా ప్రవేశపెట్టంది. మార్కెట్లలో లభ్యమయ్యే 200ml లిమ్కా సీసా బాటిల్ దగ్గర నుంచి 2.25 లీటర్ బాటిల్ కొనుగోలు చేసే వారందురు ఈ ఆఫర్ పరిధిలోకి వస్తారు. ‘డ్రా’లో పాల్గొనే వారు సీసా మూతలో ఉండే ‘LIMCA’ తరువాత తొమ్మిదక్షరాల కోడ్ ను, 07738383838 నెంబర్ కి ఎస్‌ఎమ్‌ఎస్ చేయాల్సి ఉంటుంది. అగష్టు 17, 2011, నుంచి సెప్టంబర్ 30, 2011 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

‘డ్రా’లో గెలుపొందిన వారికి 10 శ్యామ్‌సంగ్ గెలక్సీ టాబ్లెట్లను బహుమతిగా ఇస్తారు. పూర్తి వివరాలను ఆసక్తి ఉన్న వారు 0-77 38 38 38 38 ఈ నెంబర్‌కి కాల్‌చేసి వోకల్ రెస్పాన్స్ వ్యవస్థ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. డిజిటల్ మీడియా సాంకేతిక పరికరాల అవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఈ లిమ్కా ప్రచారం రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో ఈ లిమ్కా ప్రచారం ఊపందుకుంది.

కోకో..కోలా శీతల పానీయాల మార్కెటింగ్ ఇండియా, డైరక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘భారతీయ వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికతతో పాటు నాణ్యతా ప్రమాణాలతో రూపుదిద్దుకున్న పరికరాల పట్ల అవగాహన కల్పించి వారిని ఉల్లాస పరిచేందుకు ఈ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా యువతను టార్గెట్ చేసుకుని ఈ ప్రకటనను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వాణిజ్య ప్రకటన టెలివిజన్ సెట్లలో దర్శనమివ్వనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot