ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు... టాబ్లెట్‌లు
‘లావా క్స్లోలో ఏ700’ (Lava Xolo A700):

లావా మొబైల్స్ తన సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ‘క్సోలో ఏ700’(Xolo A700)ను గురువారం దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది. ధర రూ.9,999. ఈ డివైజ్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫీబీమ్ డాట్ కామ్‌లు ఆఫర్ చేస్తున్నాయి. ఇన్ఫీబీమ్ ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.100 తగ్గింపుతో విక్రయిస్తోంది.
ఫోన్ స్పెసిఫికేషన్‌లు (అధికారికంగా):
4.5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ మీడియా టెక్ ఎంటి6577 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3జీ కనెక్టువిటీ (హెచ్ఎస్‌పీఏ 7.2ఎంబీపీఎస్),
వై-ఫై 802.11 బి/జి/ఎన్,
బ్లూటూత్ వీ2.1,
ఏజీపీఎస్,
మైక్రోయూఎస్బీ 2.0,
1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
డ్యూయల్ సిమ్ ఫీచర్ (2జీ+3జీ).


Click it and Unblock the Notifications








