కొత్త రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్)!
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ (samsung galaxy grand):

బఫిన్ కోడ్ నేమ్‌తో రూపుదిద్దుకున్న స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ గ్రాండ్’ను సామ్‌సంగ్ వర్గాలు నిరాడంబరంగా ఆవిష్కరించాయి. సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వర్షన్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. గెలాక్సీ ఎస్3 తరహాలో డిజైన్ కాబడిన ఈ
స్మార్ట్ హ్యాండ్‌సెట్ ప్రత్యేకమైన ఎస్ ఫీచర్లను కలిగి ఉంది.
స్పెసిఫికేషన్‌లు……
డిస్‌ప్లే: 5 అంగుళాల మల్టీ-టచ్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ప్రాసెసర్: డ్యూయల్ కోర్ 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
స్టోరేజ్: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ: వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, హెచ్‌డిఎమ్ఐ, ఏ-జీపీఎస్ ఇంకా డీఎల్ఎన్ఏ,
బ్యాటరీ: 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది).
ధర ఇతర వివరాలు: ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విశ్లేషకులు ఈ డివైజ్ ధరను 800,000 వొన్ ల(రూ. 41,000) నుంచి 100,000 వొన్ (రూ.51,000) మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








