ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు... టాబ్లెట్‌లు
హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ(HTC Droid DNA):

ఆపిల్ నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్న సామ్‌సంగ్ రానున్న రోజుల్లో హెచ్‌టీసీ నుంచి పోటీని ఎదుర్కొనుంది. మంగళవారం న్యూయార్క్ నగరంలో ప్రముఖ టెలికం ఆపరేటర్ వెరిజాన్(Verizon)తో కలిసి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తైవాన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హెచ్‌టీసీ తన సరికొత్త 5 అంగుళాల ఫాబ్లెట్‌ను ప్రకటించింది. పేరు డ్రాయిడ్ డీఎన్ఏ ( DROID DNA).డివైజ్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే….. ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 4+ యూజర్ ఇంటర్‌ఫేస్,
5 అంగుళాల 1080పిక్సల్ హైడెఫినిషన్ సూపర్ ఎల్‌సీడీ3 డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, 1.5గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2గిగాబైట్స్ ర్యామ్, 16జీబి ఆన్‌బోర్ట్ స్టోరేజ్, బీట్స్ ఆడియో టెక్నాలజీ, 2020ఎమ్ఏహెచ్ బ్యాటరీ, మైక్రోయూఎస్బీ 2.0, 802.11 వై-ఫై ఏ/బి/జి/ఎన్, ఎన్ఎఫ్‌సీ రేడియో, గూగుల్ సర్వీసెస్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(వైడ్-యాంగిల్ లెన్స్, 5 లెవల్ ఆటోమెటిక్ ఫ్లాష్, బ్యాక్‌సైడ్ ఇల్యూమినేటెడ్ సెన్సార్), 2.1మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్. యూఎస్ మార్కెట్లో ఈ ఫోన్‌ను వెరిజాన్ విక్రయిచనుంది. ఇందుకు సంబంధించి ప్రీఆర్డర్లు ప్రారంభించినట్లు సమాచారం. ధర $199 (రూ.11,000) రెండు సంవత్సరాల ఒప్పందంతో. హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ వెరిజాన్ వర్షన్ వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications