ఈ వారం విడుదలైన టాబ్లెట్స్.. స్మార్ట్‌ఫోన్స్!
పెంటా టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్702సీ (Pantel BSNL Penta T-Pad WS702C):

పాంటెల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్ (పీపీటీఎల్), ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) భాగస్వామ్యంతో సరికొత్త టాబ్లెట్ పీసీని దేశీయ విపణిలో ఆవిష్కరించింది. టాబ్లెట్ పేరు ‘పెంటా టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్702సీ’. ధర రూ.7,499. 3డీ వ్యవస్థను డివైజ్ సపోర్ట్ చేస్తుంది. 2జీ వాయిస్ కాలింగ్ నిర్వహించుకోవచ్చు. డాంగిల్ సపోర్ట్‌తో 3జీ సేవలను పొందవచ్చు. వై-ఫై సపోర్ట్ మరో ప్రత్యేకత…..
‘పెంటా టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్702సీ’ ఫీచర్లు:
7 అంగుళాల మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
మల్లీ ఫార్మాట్ ఆడియో ఇంకా వీడియో ప్లేయర్,
ఈ-బుక్ రీడర్,
2జీ సిమ్‌కార్డ్ స్లాట్,
3జీ కనెక్టువిటీ వయా డాంగిల్,
వై-ఫై 802.11 బి/జి/ఎన్,
యూఎస్బీ, మీనీ యూఎస్బీ,
హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,
బ్యాటరీ బ్యాకప్ 6 గంటలు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా పాంటెల్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ విజేందర్ సింగ్ స్పందిస్తూ అత్యుత్తమ కంప్యూటింగ్ టెక్నాలజీని ఈ తక్కువ ధర టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. 3డి యాక్సిలరేషన్ గ్రాఫిక్ వ్యవస్థతో ఇండియాలో మొట్టమొదటిగా విడుదలవుతున్న టాబ్లెట్ తమదేనని సింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ పీసీ కొనుగోలు పై బీఎస్ఎన్ఎల్ వివిధ డాటా ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








