ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు!
అసస్ ప్యాడ్‌ఫోన్ (Asus PadFone):

తైవాన్‌కు చెందిన ప్రముఖ కంప్యూటర్‌ల నిర్మాణ సంస్థ అసస్, స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా హైబ్రీడ్ టాబ్లెట్ ఫీచర్లను ఒదిగి ఉన్న ప్యాడ్‌ఫోన్‌ను మంగళవారం బెంగుళూరులో విడుదల చేసింది. అసస్ ప్యాడ్‌ఫోన్ ఇండియన్ మార్కెట్ ధర రూ.64,999. ఈ కార్యక్రమంలో భాగంగా అసస్ టాబ్లెట్ ఇంకా నోట్‌బుక్ ఫీచర్లను కలిగి ఉన్న డివైజ్ ‘ట్రాన్స్‌ఫార్మర్ ప్యాడ్ టీఎఫ్300టీ’ని ప్రకటించింది ధర రూ. 43,999.
ఈ డివైజ్‌ను స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ అదేవిధంగా నోట్‌బుక్‌లా ఉపయోగించుకోవచ్చు. ఫీచర్లు: 4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే(రిసల్యూషన్ సామర్ధ్యం 960 x 540పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 1 జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, 1520 ఎమ్ఏహెచ్ లయోన్ బ్యాటరీ. 16,32,64జీబి మెమరీ కాన్ఫిగరేషన్స్. కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ హెచ్ఎస్‌యూపీఏ 5.76ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌డిపీఏ 21 ఎంబీపీఎస్, వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్ 4.0. ఇతర ఫీచర్లు: కీబోర్డ్ డాక్, మల్టీటచ్ ప్యాడ్, ఎస్డీకార్డ్ రీడర్, యూఎస్బీ పోర్ట్, హెడ్‌సెట్ స్టైలస్.


Click it and Unblock the Notifications