మార్కెట్లోకి లాగిటెక్ బ్లూటూత్ కీబోర్డులు!

Posted By: Staff

మార్కెట్లోకి లాగిటెక్ బ్లూటూత్ కీబోర్డులు!

 

 

నీటితో కడిగి శుభ్రం చేయతగిన కీబోర్డులను దేశీయ మార్కెట్లో విజయవంతంగా ఆవిష్కరించిన లాగిటెక్ (Logitech) సంస్థ తాజాగా ఆపిల్ పరికరాల కోసం మూడు సరికొత్త కీబోర్డులను మార్కెట్లో ఆవిష్కరించింది. బ్లూటూత్, అల్టాథిన్, సోలార్ శ్రేణుల్లో  రూపుదిద్దుకున్న ఈ కీబోర్డ్‌లు ఆపిల్ ఐఫోన్ ఇంకా ఐప్యాడ్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్  చేశారు.

Read in English:

లాగిటెక్ అల్ట్రాథిన్ కీబోర్డ్:

ప్రత్యేకించి ఐప్యాడ్ కోసం డిజైన్ కాబడిన లాగిటెక్ అల్ట్రాథిన్ కీబోర్డ్‌ను స్ర్కీన్ కవర్‌లా ఉపయోగించుకోవచ్చు. బ్లూటూత్ ఆధారితంగా డివైజ్‌కు జతచేసుకోవల్సి ఉంటుంది. కీబోర్డ్‌లో ఏర్పాటు చేసిన మ్యాగ్నటిక్ క్లిప్ ఐప్యాడ్‌తో జత చేసి ఉంచుతుంది. ఐప్యాడ్2 అదేవిధంగా ఐప్యాడ్3‌లను ఈ కీబోర్డ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ (6నెలలు), ధర రూ.6,599.

లాగిటెక్ సోలార్ కీబోర్డ్ ఫోలియో:

ఈ కీబోర్ద్‌లో నిక్షిప్తం చేసిన సోలార్ సెల్స్ సూర్మరస్మి ద్వారా చార్జ్ క్వాడతాయి. బ్లూటూత్ ఆధారితంగా జత చేసకోవల్సి ఉంటుంది. కీబోర్డ్‌లో ఏర్పాటు చేసిన మల్టీ-వ్యూ స్టాండ్ ఫీచర్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. పూర్తి బ్యాటరీ చార్జ్  రెండు సంవత్సరాల బ్యాకప్‌నిస్తుంది.  ధర రూ.8,999.

లాగిటెక్ వైర్‌లెస్ సోలార్ కీబోర్డ్ కె760:

ఆకర్షణీయమైన స్లిమ్ లుక్‌లో తయారు కాబడిన లాగిటెక్ వైర్‌లెస్ సోలార్ కీబోర్డ్ కె760 మ్యాక్ స్పెసిఫిక్ బటన్‌లను కలిగి ఉంటుంది. నిక్షిప్తం చేసిన ఆన్‌బోర్డ్  సోలార్ సెల్స్ వెలుతురు ద్వారా చార్జ్ అవుతాయి. పూర్తి  చార్జింగ్ మూడు నెలల

బ్యాకప్‌ను అందిస్తుంది. ధర రూ.6,599.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot