‘ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ 13’ మీ పెట్టుబడికి భరోసా..!!

Posted By: Staff

‘ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ 13’ మీ పెట్టుబడికి భరోసా..!!

‘‘ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘ఆపిల్’ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మ్యాక్ బుక్ ల్యాప్ టాప్ సరీస్’ ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ తన ఉనికిని మరింత చాటుకునే క్రమంలో ‘మ్యాక్ బుక్ ఎయిర్ 13’(MacBook Air 13) పేరుతో మరో అధునాతన ల్యాపీని మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వినియోగదారుడి విశ్వసనీయతను చొరగునే లక్ష్యంలో భాగంగా ‘ఆపిల్’ ఈ కొత్త గ్యాడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కసరత్తులను పూర్తి చేసింది.’’

మ్యాక్ బుక్ ఎయిర్ 13 పై విశ్లేషణ క్లుప్తంగా :

- విండోస్ 7 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారింతంగా 13 అంగుళాల ‘మ్యాక్ బుక్ ఎయిర్ 13’ పని చేస్తుంది.

- సరికొత్త కూల్ లుకింగ్ బ్యాక్ లిట్ కీబోర్డు, సాండీ బ్రిడ్జి ప్రోసెసింగ్ వ్యవస్థ, సామర్ధ్యం కలిగిన మెటాలిక్ బాడీ, అల్ట్రాపోర్టుబుల్ నాణ్యత వంటి అంశాలు వినియోగదారుడికి మరింత లబ్థి చేకూరుస్తాయి.

- 13 అంగుళాల అద్భుతమైన స్క్రీన్ నాణ్యమైన విజువల్ అనుభూతిని వినియోగదారుడికి అందిస్తుంది. కేవలం 1.34కేజీల బరువు కలిగిన ల్యాపీని వినియోగదారుడు సౌకర్యవంతంగా తీసుకెళ్లవచ్చు.

- పొందుపరిచిన కోర్ i5 ప్రొసెసింగ్ వ్యవస్థ, 4జీబీ ర్యామ్, 256 GB SSD, యూఎస్బీ v2.0 పోర్టు, తండర్ బోల్ట్ పోర్టు, ఎస్బీ కార్డ్ స్లాట్ తదితర అంశాలు మన్నికైన పనితీరును కలిగి ఉంటాయి.

- 802.11 b/g/n వై-ఫై వ్యవస్థ, v2.1 అధునాతన బ్లూటూత్ వ్యవస్థ, హై డెఫినిషన్ సామర్ధ్యం కలిగిన వెబ్ క్యామ్ సమచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి. మల్టీటచ్ ఇన్ పుట్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

- 750 GB HDD సామర్ధ్యం కలిగిన మన్నికైన బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలిక పవర్ ను ల్యాపీకి అందిస్తుంది.

- చివరిగా ధర విషయానికి వస్తే ఇండియన్ మార్కెట్లో ‘ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ 13’ ధర రూ. 60,000/ ఉంటుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot