Home
Computer

ఆపిల్ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌.. M5 చిప్‌, 18 గంటల బ్యాటరీ లైఫ్‌ సహా సూపర్‌ ఫీచర్లు.. ఇవాళ్టి నుంచే..!

Apple Macbook Air M5 : ఆపిల్ సంస్థ ఇటీవల భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌లో ఐఫోన్ 17e, ఐప్యాడ్‌ ఎయిర్‌ M4 (2026) మోడల్స్‌ విడుదల చేసింది. అయితే తాజాగా M5 చిప్‌ తో కూడిన మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ లాంచ్‌ అయింది. గత వేరియంట్స్‌ లో పోలిస్తే బేస్‌ స్టోరేజీ వేరియండ్స్‌ ను డబుల్‌ చేసింది. దీంతోపాటు అత్యుత్తమ ఏఐ ఫీచ్లర్లను కలిగి ఉంది. ఈ మ్యాక్‌బుక్‌ పూర్తి ఫీచర్ల వివరాలు.

మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ 2026 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M5 మోడల్‌ 13.6 అంగుళాలు, 15.3 అంగుళాల లిక్విడ్‌ రెటీనా డిస్‌ప్లేలలో అందుబాటులో ఉంటుంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 1 బిలియన్ కలర్స్‌ ను సపోర్టు చేస్తుంది.

Macbook air 2026 sale and price

గతంతో పోలిస్తే మెరుగైన పనితీరు :
మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ 2026 మోడల్‌ M5 చిప్‌ తో పనిచేస్తుంది. గత వేరియంట్‌తో పోలిస్తే మెరుగైన పనితీరును అందిస్తుందని ఆపిల్‌ చెబుతోంది. 10 కోర్‌ CPU, 10 కోర్‌ GPU ఉన్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) టాస్క్‌ల కోసం న్యూరల్‌ యాక్సిలరేటర్‌ ను కలిగి ఉంది.

M4 చిప్‌ తో పనిచేస్తున్న మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ మోడల్‌ తో పోలిస్తే ఈ కొత్త మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ 4 రెట్లు మెరుగైన పనితీరును కనబరుస్తుంది. macOS Tahoe తో పనిచేస్తుంది. 512GB బేస్‌ స్టోరేజీతో లాంచ్‌ అయింది. 4TB స్టోరేజీ వరకు సపోర్టు చేస్తుంది.

Macbook air 2026 sale and price

18 గంటల బ్యాటరీ లైఫ్‌ :
మ్యాక్‌బుక్‌ ఎయిర్ M5 మోడల్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ ను ఇస్తుందని ఆపిల్‌ చెబుతోంది. దీంతోపాటు మ్యాగ్‌సేఫ్‌ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. 12MP సెంటర్‌ స్టేజ్‌ కెమెరాను కలిగి ఉంది. కదలికలకు అనుగుణంగా కెమెరా ఫోకస్‌ చేస్తుంది. దీంతోపాటు డెస్క్‌ వ్యూ ఫీచర్‌ కూడా ఉంది.

ఈ కొత్త మ్యాక్‌బుక్‌ లో డాల్బీ అట్మాస్‌, స్పేషియల్‌ ఆడియో సపోర్టుతో స్పీకర్లను కలిగి ఉంది. వైఫై 7, బ్లూటూత్ 6, థండర్‌బోల్ట్‌ 4 పోర్టులు ఉన్నాయి. N1 వైర్‌లెస్‌ నెట్‌వర్కింగ్‌ చిప్‌ కారణంగా వైఫై, బ్లూటూత్‌ కనెక్టివిటీ మెరుగ్గా ఉంటుందని ఆపిల్‌ చెబుతోంది.

భారత్‌ మార్కెట్‌ లో మ్యాక్‌బుక్‌ ఎయిర్ M5 మోడల్‌ ముందస్తు బుకింగ్‌లు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 11 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. స్కై బ్లూ, సిల్వర్‌, స్టార్‌లైట్‌, మిడ్‌నైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

13 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్ ధరలు
16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,19,900
24GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,39,900

15 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌ ధరలు
16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.1,44,900
16GB ర్యామ్ + 1TB స్టోరేజీ ధర రూ.1,64,900
24GB ర్యామ్ + 1TB స్టోరేజీ ధర రూ.1,84,900

More from GizBot

Best Mobiles in India

English summary
Macbook air 2026 Launched in india with M5 Chip, Liquid Retina Display features, price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X