మ్యాక్‌బుక్ ఎయిర్ M3, M2 మోడల్స్ ఇంకా ఉన్నాయ్.. కొనొచ్చా? లేక స్కిప్ చెయ్యాలా?
MacBook Air M3 and M2: యాపిల్ కంపెనీ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ M4 లాంచ్ చేసిన వెంటనే, అంతకుముందు మోడల్స్ అయిన మ్యాక్‌బుక్ ఎయిర్ M3, M2లను అమ్మడం ఆపేసింది. అంటే ఇకపై మీరు వీటిని యాపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో కానీ, ముంబైలోని యాపిల్ బీకేసీ, ఢిల్లీలోని యాపిల్ సాకేత్ లాంటి వాళ్ల స్టోర్లలో కానీ కొనలేరు.
కానీ, మీకు ఇంకా ఈ మోడల్స్‌పై మోజు ఉంటే, దిగులు పడకండి. వాటిని కొనే దారులు ఇంకా ఉన్నాయి. యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M3, M2 అమ్మకాలు ఆపేసినా, ఈ మోడల్స్ ఇంకా మార్కెట్‌లో దొరుకుతున్నాయి. మీ దగ్గరలోని మొబైల్ షాపుల్లో, పెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్లలో వెతకాలి.

ఆన్‌లైన్‌లో అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి వెబ్‌సైట్లలో చూడండి. కాస్త గట్టిగా వెతికితే, మంచి డిస్కౌంట్‌తో దొరికే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మ్యాక్‌బుక్ ఎయిర్ M3 (16GB RAM, 256GB SSD, 13-inch స్క్రీన్) ధర రూ.1,09,999 దగ్గర ఉంది. మ్యాక్‌బుక్ ఎయిర్ M2 (8GB RAM, 512GB SSD) అయితే రూ.78,990కి దొరుకుతోంది.
ధరలు ఒక్కోచోట ఒక్కోలా ఉండొచ్చు, అందుకే అన్ని వెబ్‌సైట్లు, షాపులు తిరిగితే బెస్ట్ డీల్ అందుకోవచ్చు వీటికి ఇప్పుడు డిమాండ్ బాగానే తగ్గి ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ధరకే అడగడానికి ప్రయత్నించాలి. గతంలో ఉన్న రేటుకే దీన్ని కొనుగోలు చేస్తే మీరు నష్టపోయినట్లే అవుతుంది.
* కొత్త M4 మోడల్ తక్కువ ధరకి వస్తుంటే, పాత M3, M2 ఎందుకు కొనాలి..
యాపిల్ వాళ్లే మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధరను తగ్గించేశారు. దీంతో ఇప్పుడు చాలామంది చూపు దాని మీదే పడుతోంది. బేసిక్ మోడల్ M4 (16GB RAM, 256GB SSD) ధర ఇప్పుడు రూ.99,900. బ్యాంక్ ఆఫర్లు కలుపుకుంటే, ఇది రూ.89,900కే వస్తుంది. స్టూడెంట్స్‌కి యాపిల్ ఎడ్యుకేషన్ స్టోర్ ద్వారా ఇంకా తక్కువ ధరకే M4 దొరుకుతుంది.
* మ్యాక్‌బుక్ ఎయిర్ M4లో కొత్తగా ఏముంది?
మ్యాక్‌బుక్ ఎయిర్ M4 రెండు సైజుల్లో వస్తోంది. 13- అంగుళాల, 15-అంగుళాలు. రెండిటిలోనూ మంచి క్లారిటీతో లిక్విడ్ రెటినా డిస్‌ప్లే ఉంటుంది, 500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంవల్ల చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా ఇందులో 10-కోర్ CPU, 10-కోర్ GPU వరకు ఉన్నాయి.
బేసిక్ మోడల్‌లోనే 16GB RAM ఇస్తున్నారు. టచ్ ID, మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్, వై-ఫై 6E, బ్లూటూత్ 5.3, రెండు థండర్‌బోల్ట్ పోర్ట్‌లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 12MP ఫ్రంట్ కెమెరా (సెంటర్ స్టేజ్‌తో) లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 6K ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది.
కలర్స్ విషయానికొస్తే, స్కై బ్లూ అనే కొత్త రంగుతో పాటు, సిల్వర్, స్టార్‌లైట్, స్పేస్ గ్రే, మిడ్‌నైట్ కలర్స్‌లో కూడా లభిస్తుంది. నచ్చిన కలర్ ఎంపిక చేసుకోవచ్చు పర్ఫామెన్స్ తో పాటు స్టైలిష్ ల్యాప్‌టాప్ కావాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్ అవుతుందని అనడంలో సందేహం లేదు.
* M3/M2 కొనాలా? లేక M4 కి వెళ్లాలా?
ఒకవేళ మీకు M3 లేదా M2 మోడల్స్ భారీ డిస్కౌంట్‌లో దొరికితే, అప్పుడు వాటి గురించి ఆలోచించొచ్చు. కానీ M4 మోడల్‌లో ఎక్కువ స్పీడ్, కొత్త ఫీచర్లు, తక్కువ ధర కూడా ఉండటంతో, చాలామందికి మ్యాక్‌బుక్ ఎయిర్ M4 నే బెస్ట్ ఛాయిస్ అవుతుంది.


Click it and Unblock the Notifications








