సంచలనం రేపుతున్న వీడియో టేప్!!

Posted By: Staff

సంచలనం రేపుతున్న వీడియో టేప్!!

ఆపిల్ ఐప్యాడ్‌లను తయారు చేసే చైనా సంస్థ ‘ఫాక్స్‌కాన్’కు వావ్ అనిపించే చరిత్రే ఉంది. నగరాన్ని తలపించే ఈ ఫ్యాక్టరీలోకి ఇతరులకు అనుమతి లభించటం చాలా కష్టం. మార్కెట్ ప్లేస్‌కు చెందిన రాబ్ స్కిమ్చ్‌కు ఫ్యాక్టరీలోనికి ప్రవేశించే అరుదైన అవకాశం లభించింది. ఇంకేం మనోడి ఆనందాలకు అవదులే లేవు. అందివచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్న రాబ్, అక్కడి పని వాతావరణాన్ని వీడియో రూపంలో చిత్రీకరించాడు. అంతేకాకుండా పలు ఆశ్చర్యకర విషయాలను రాబట్టాడు.

Watch Video

ఐప్యాడ్ తయారీ ప్రక్రియ ఆషామాషీ కాదు. ఈ డివైజ్ నిర్మాణానికి సంబంధించి కొన్ని పనులు రోబోట్‌లు మాత్రమే చక్కబెట్టగలవు. వేలాది మంది ఉద్యోగులు ఈ కంపెనీలో షిఫ్ట్స్ వారీగా నిరంతం పని చేస్తూనే ఉంటారు. ఆశాజనకమైన జీతాలను చెల్లించే కంపెనీలలో ఫాక్స్‌కాన్ ఒకటి. ఉద్యోగులను పని ఒత్తిళ్ల నుంచి దూరం చేసేందుకు ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిమ్, ఒలంపిక్ పూల్, బాస్కెట్ బాల్, సాకర్ స్టేడియమ్‌లు మానసిక ఉల్లాసాన్ని రెట్టింపు చేసేవిగా ఉన్నాయి. ఐప్యాడ్ నిర్మాణం అదేవిధంగా అక్కడి పనివాతవరణాన్ని కింద జత చేసిన వీడియో ద్వారా తిలకించవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot