చైనా బ్రాండ్ వస్తుంది గురూ..!!

Posted By:

చైనా బ్రాండ్ వస్తుంది గురూ..!!

 

ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ బ్రాండ్ మలాటా 2012-13 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించి తన భవిష్యత్ కార్యచరణను విడుదల చేసింది. మెరుగైన కంప్యూటింగ్ ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసిన ఈ చైనా బ్రాండ్ వచ్చే రెండేళ్లలో హై ఎండ్ టాబ్లెట్ పీసీలతో పాటు గుడ్ లుకింగ్ మొబైల్ హ్యాండ్‌సెట్‌లను అందించనుంది. జూన్ 4వ తేది నుంచి పదో తేదీ వరకు తైపీలో నిర్వహించనున్న కంప్యూటెక్స్ తైపీ ఈవెంట్‌లో మలాటా ఈ డివైజ్‌లను ప్రదర్శించనుంది.

మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పులు నేపధ్యంలో టాబ్లెట్ పీసీల నిర్మాణం పై ఈ చైనా కంపెనీ ప్రధానంగా ద్ళష్టి సారించింది. పోటీ మార్కెట్లో నిలదొక్కుకునే విధంగా మెరుగైన ఫీచర్లతో టాబ్లెట్ కంప్యూటర్‌ను డిజైన్ చేసింది. మలాటా SMB-B1023 మోడల్‌లో తుది మెరుగులుదిద్దుకున్న ఈ డివైజ్ 7, 9.7,10.1 డిస్‌ప్లే వేరియంట్‌లలో లభ్యం కానుంది. ప్రధాన ఫీచర్లు పరిశీలిస్తే... * ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం, *   ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్, *   3జీ, *  వై-ఫై, *   బ్లూటూత్.

అధిక ధర వెచ్చించలేని కస్టమర్ల కోసం మాలాటా  ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషించింది. SMB-B1023 నమూనాలోనే లో-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో కూడిన టాబ్లెట్ పీసీలను తయారు చేసింది. స్మార్ట్‌ఫోన్ విభాగం పై ద్ళష్టి కేంద్రీకరించిన మలాటా 5 అంగుళాల హై రిసల్యూషన్ డిస్‌ప్లే‌తో కూడిన మన్నికైన హ్యాండ్‌సెట్‌లను వ్ళద్ధి చేసింది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్   v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్‌లు రన్ అవుతాయి.3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎష్ మాడ్యుల్ వంటి ఉపయుక్తమైన ఫీచర్లను ఈ హ్యాండ్‌సెట్‌లలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot