మనిషిలోకి కంప్యూటర్ వైరస్..?

Posted By: Staff

Man Infects Himself with (Computer) Virus

మీ పర్సనల్ కంప్యూటర్లోకి వైరస్ చేరడం దానిని మీరు నియంత్రించడం సాధారణమైన విషయం. అయితే మనిషిలోకి కంప్యూటర్ వైరస్ ప్రవేశిస్తే..?

ఈ అంశం పై ఇంగ్లాండ్‌కు చెందిన పరిశోధకుడు మార్క్ గుస్సన్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టి, ప్రపంచంలోనే తొలిసారి కంప్యూటర్ వైరస్‌ను శరీరంలో నిక్షిప్తం చేసుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. బియ్యపు గింజ పరిమాణంలో చిప్‌ను తయారు చేసిన గస్సన్ తన చేతిలో అమర్చుకున్నాడు.

దానితో ల్యాబ్ తలుపులను, మొబైల్ ఫోన్‌ను నియంత్రించాడు. మరో అడుగు ముందుకేసి మాలిషియన్ కోడ్‌ను శరీరంలో ఉన్న చిప్‌లోకి ఎక్కించుకున్నాడు. దీంతో చిప్‌ను యాక్సెస్ చేసే నెట్‌వర్క్ వ్యవస్థ మొత్తం వైరస్ బారిన పడింది. ఈ మొత్తం పరిశోధన ఆధారంగా ఆసక్తికర అంశాలను గుస్సన్ బయటపెట్టాడు.

పేస్ మేకర్, ఇయర్ ఇంప్లాంట్స్ లాంటి మెడికల్ పరికరాలను వైద్యులు రోగుల శరీరంలో ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. అయితే భవిష్యత్‌లో ఈ మెడికల్ పరికరాల సైతం కంప్యూటర్ వైరస్ బారిన పడోచ్చని మార్క్గు గుస్సన్ హెచ్చరిస్తున్నాడు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting