సముద్ర గర్భంలో కెమెరాను దొంగలించేందుకు యత్నించిన ఆక్టోపస్

Posted By:

సముద్ర గర్భంలో దొంగ బీభత్సం!

సముద్ర గర్భంలో చోటు చేసుకున్న ఆ దృశ్యం కుస్తీల పోటీని తలపించింది... 8 కాళ్లను కలగి ఉన్న ఓ భయానక సముద్ర జంతువు తను చిత్రీకరిస్తున్న ఓ వ్యక్తి పై కొట్లాటకు దిగి అతని వద్ద ఉన్న ఓ విలువైనవస్తువును దొంగలించేందుకు ముమ్మర ప్రయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే... కాలిఫోర్నియాలోని కార్మెల్ ఆఫ్ బ్లూఫిష్ ఉపసాగరంలో ఇద్దరు అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్లు 71 కేజీల బరువుతో భయానక రూపాన్ని కలిగి ఉన్న జెయింట్ ఆక్టోపస్ ను చిత్రీకరిస్తున్నారు.

అంతా సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో ఆ సముద్ర జీవి తనను దగ్గరగా చిత్రీకరిస్తున్న ఓ ఫోటోగ్రాఫర్ పై దాడి చేయటం ప్రారంభించి. అతని వద్దఉన్న విలువైన కెమెరాను నోటిలోకి లాక్కునే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వెడెక్కింది. నోటిలోకి లాక్కునే సమయంలో సదరు డివైస్ నుంచి ఫ్లాష్ లు రావటంతో ఒక్కసారిగా భయకంపితమైన ఆక్టోపస్ ఆ కెమెరాను విడిచిపెట్టేసింది. ఈ మొత్తం దృశ్యం ఆ ఫోటోగ్రాఫర్  గోప్రో కెమెరాలో రికార్డయ్యింది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/i9e5IEq9DoI? feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting