ఆల్ ఇండియా రేడియో నుంచి ‘ఉచిత న్యూస్ ఎస్ఎంఎస్ సర్వీస్’

Posted By:

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార ఇంకా ప్రసార శాఖా మంత్రి మనీష్ తివారీ సోమవారం ఆల్ ఇండియా రేడియో ఉచిత న్యూస్ ఎస్ఎంఎస్ సర్వీసును కొత్తఢిల్లీలో ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో ఆయన భారత్ నిర్మాణ్ ప్రచారానికి సంబంధించి వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించటం జరిగింది.

 ఆల్ ఇండియా రేడియో నుంచి  ‘ఉచిత న్యూస్ ఎస్ఎంఎస్ సర్వీస్’

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని మారుమూల గ్రామాల నుంచి కొత్త కధనాలను సేకరించేందకు ఆల్ ఇండియా రేడియోకు విస్తృతమైన ప్రతినిధుల బృందం ఉందని తెలిపారు. వాస్తవ సమయంలో ప్రజలకు వార్తలనందించటంలో ఆల్ ఇండియా రేడియో ఉచిత న్యూస్ ఎస్ఎంఎస్ సర్వీసు దోహదపడుతుందని మంత్రి వెల్లడించారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రస్తుతం ఈ ఉచిత న్యూస్ ఎస్ఎంఎస్ సర్వీసును వినియోగించుకుంటున్న వారి సంఖ్య 2 లక్షలుగా ఉందని, నెలాఖరు నాటికి ఈ సంఖ్య 5 లక్షలకు పెరిగే అవకాశముందని మంత్రి అభిప్రాయపడ్డారు.

ఆల్ ఇండియా రేడియో అందిస్తున్న ఉచిత న్యూస్ ఎస్ఎంఎస్ సర్వీసును రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉచితంగా ప్రధాన వార్తలకు సంబంధించిన ముఖ్యాంశాలను ఎస్ఎంఎస్ రూపంలో పొందుతారు.

ఆల్ ఇండియా రేడియో అందిస్తున్న ఈ ఉచిత న్యూస్ సర్వీసును పొందాలనుకునే వారు తమ మొబైల్ లో AIRNWS అని టైప్ చేసి కొంచం స్పేస్ ఇచ్చి తమ పేరును టైప్ చేసి 08082080820కు ఎస్ఎంఎస్ చేయవలసి ఉంటుంది. లేదా 08082080820 నెంబరుకు మిస్సుడ్ కాల్ ఇస్తే సరిపోతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot