బ్యాంకులకు విండోస్ ఎక్స్‌పీ గండం!

Posted By:

ఏప్రిల్ 8వ తేదీ నుంచి విండోస్ ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టం సర్వీసులు మైక్రోసాఫ్ట్ వెల్లడించిన నేపధ్యంలో బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే పర్సనల్ కంప్యూటర్లు ఇంకా ఏటీఎంలలో సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయా వ్యవస్థలను అప్ గ్రేడ్ చేయాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

 బ్యాంకులకు విండోస్ ఎక్స్‌పీ గండం!

అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టంను 2001, అక్టోబర్‌లో విడుదల చేసింది. ప్రస్తుతమున్న విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టంతో పోలిస్తే విండోస్ ఎక్స్‌పీ మూడు జనరేషన్‌లు వెనుకబడి ఉంది.

ప్రస్తుతం భారత్‌లో లక్ష వరకు ఏటీఎంలు ఉంటాయని, వాటిలో అత్యధిక శాతం ఏటీఎమ్‌లు విండోస్ ఎక్స్‌పీ పై రన్ అవుతున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా జనరల్ మేనేజర్ (విండోస్ బిజినెస్) అమ్రిష్ గోయెల్ పేర్కొన్నారు. విండోస్ ఎక్స్‌పీ సేవలు నిలిచిపోనున్న నేపధ్యంలో బ్యాంక్ యాజమాన్యాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot