మానవరహిత విమానాల ద్వారా ఫేస్‌బుక్ ఇంటర్నెట్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను విస్తరింపచేసేందుకు తాము కసరత్తులు చేస్తున్నట్లు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తెలిపింది. ఈ ఇంటర్నెట్ ప్రాజెక్టులో భాగంగా డ్రోన్‌లు (మానవ రహిత విమానాలు), ఉపగ్రహాలు (శాటిలైట్స్) ఇంకా సౌరశక్తితో నడిచే విమానాలను ఉపయోగించే అంశపై పరిశోధనలు ప్రారంభించినట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.

ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఆకాశ మార్గం ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే, ప్రపంచం మొత్తాన్ని అనుసంధానం చేయడానికి కొత్తటెక్నాలజీని అభివృద్థి చేయవల్సి ఉందని ఫేస్‌బుక్ అధ్యక్షుడు మార్క్ జూకర్‌బెర్గ్ ఫేస్‌బుక్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసారు.
ఈ అంతర్జాల సర్వీసులకు సంబంధించి ఫేస్‌బుక్‌కు చెందిన కనెక్టువిటీ ల్యాబ్‌లో ప్రయోగాలు చేపడుతున్నట్లుఈ సందర్భంగా ఫేస్‌బుక్ వెల్లడించింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








