సరైన సమయంలో.. సరైన పంచ్: మ్యాక్స్

అత్యాధినిక పరిజ్ఞానంతో పాటు, మన్నికతో కూడిన ‘టాబ్లెట్ పీసీ’తో తాము మార్కెట్లోకి రానున్నట్లు మ్యాక్స్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ అగర్వాల్ ఇటీవల ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ఈ ‘టాబ్లెట్ పీసీ’ అభివృద్ధికి సంబంధించి పరిశోధనలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయని ఆయన తెలిపారు. ‘మ్యాక్స్’ మొబైల్ ఫోన్ల అమ్మకాల విషయంలో ముందంజలో నిలిచినట్లుగానే, టాబ్లెట్ పీసీల అమ్మకాలలో కూడా ముందుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా ‘మ్యాక్స్’ లోకల్ బ్రాండ్ కావటంతో భారతీయ వినియోగాదారుకు మరింత చేరవయ్యే అవకాశముందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఏదేమైనా విడుదల కాబోతున్న ‘మ్యాక్స్’ టాబ్లెట్ పీసీ, శ్యామ్‌సంగ్ గేలక్సీ, ఆపిల్ ఐప్యాడ్, డెల్ స్ట్రీక్ వంటి టాప్ బ్రాండ్లకు పొటీనిస్తుందని అంచనాలు ఊపందుకున్నాయి. ఆధునికతతో పాటు మన్నిక పై దృష్టి సారించిన ‘మ్యాక్స్’ టాబ్లెట్ పీసీలతో మార్కెట్‌లో హిట్ కొట్టడం కాయమని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. టాబ్లెట్ పీసీల వినియోగం రానున్న రోజుల్లో మరింత ఊపందుకుంటుందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. సరైన సమయాన్ని ఎంచుకున్న ‘మ్యాక్స్’ ఆధునికతతో పాటు మన్నికతో కూడిన టాబ్లెట్ పీసీలను భారతీయ మార్కెట్లో విడుదల చేసి వినియోగదారులను ఆకట్టుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. భారతీయ సెల్ ఫోన్ మార్కెట్లో విదేశీ కంపెనీల హవా తగ్గించేందుకు మ్యాక్స్ కొత్త వ్యూహాలను అనుసరించబోతుంది. ఈ మేరకు రూ.320 కోట్ల పెట్టుబడితో నాణ్యమైన 40 మోడళ్ల మొబైల్ ఫోన్లను ఈ ఏడాది చివరకల్లా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు ఛైర్మన్ అజయ్ అగర్వాల్ తెలిపారు.


Click it and Unblock the Notifications








