పండుగ ఆఫర్: టాబ్లెట్ కొనండి.. ఎల్ఈడి టీవీ గెలుచుకోండి!

Posted By: Prashanth

పండుగ ఆఫర్: టాబ్లెట్ కొనండి.. ఎల్ఈడి టీవీ గెలుచుకోండి!

 

ప్రముఖ కంప్యూటింగ్ ఉపకరణాల తయారీ కంపెనీ కోబియాన్, మెర్క్యురీ బ్రాండ్ క్రింద స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో దీపావళి సీజన్‌ను పురస్కరించుకుని తమ టాబ్లెట్ పీసీల కొనుగోళ్ల పై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు కోబియాన్ సంస్థల కంట్రీ మేనేజర్ సుష్మితా దాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పండుగ ఆఫర్‌లో భాగంగా ఎంటాబ్ శ్రేణి టాబ్లెట్ కొనగోలుపై 4జీబి మైక్రోఎస్డీ కార్డ్‌ను ఉచితంగా పొందవచ్చు. అంతేకాకుండా.. లక్కీ డ్రాలో ఎల్ఈడి టీవీ తదితర భారీ బహుమతులను పొందే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది.

తాజాగా ఎంటాబ్7 పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్‌ను కోబియన్ ఆవిష్కరించింది ఫీచర్లు.......

7 అంగుళాల కెపాసిటివ్ లైట్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్800x 480పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

3జీ సపోర్ట్ వయా డాంగిల్,

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

మైక్రోయూఎస్బీ 2.0,

హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కోబియన్ నుంచి తాజాగా విడుదలైన మరో టాబ్లెట్ ఎంటాబ్ నియో2 కీలక ఫీచర్లు:

9.7 అంగుళాల వైడ్ ఐపీఎస్ డిస్‌ప్లే,

ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,

1జీబి డీడీఆర్3 ర్యామ్,

ధర రూ.11,999.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot