ఆ ‘పాదరసాన్ని’ మీరు తాకితే... ఫుల్ రీఛార్జ్!!

Posted By: Staff

ఆ ‘పాదరసాన్ని’ మీరు తాకితే... ఫుల్ రీఛార్జ్!!

"ఆ పాదరసాన్ని తాకితే.. ఒక్క సారిగా మీలో మెరుపు, చిన్నికృష్ణుడి నోటిలో విశ్వం కనబడినట్లు, మీ అరచేతిలో ప్రపంచం కనబుడుతుంది. సమాచార వ్యవస్థ మీ చుట్టూనే పరిభ్రమిస్తుంటుంది. అనంత కోటి విశ్వంలో ఏ అద్భుతం చోటుచేసుకున్నా క్షణాల్లో ఆ సమాచారం మీముందుంటుంది. ఇంతకి ఆ పాదరసం ఏంటానని అనుకుంటున్నారా... ప్రఖ్యాత సాంకేతిక పరికరాల తయారీదారు ‘మెర్క్యురీ’ భారతీయ మార్కెట్లో అధునాతన టాబ్లెట్ పీసీలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఫుల్ జోష్ తో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్లు వినయాక చవితి కానుకుంగా మీమ్మల్ని తప్పక రిఛార్జ్ చేస్తాయి...’’

దిగ్గజ మెర్క్యురీ సంస్థ ‘ఎమ్’ ట్యాబ్ పేరుతో సరికొత్త ట్యాబ్లెట్‌ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. కేవలం 400 గ్రాముల బరువు కలిగి ఉన్న ఈ టాబ్లెట్ పీసీ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తుంది. సెట్లో పొందుపరిచిన శక్తివంతమైన 1GHz 3 ప్రొసెసర్, 512 ర్యామ్ వ్యవస్థ అత్యుత్తమ పనితీరును వినియోగదారునికి అందిస్తాయి.

‘ట్యాబ్’లో పొందుపరిచిన 4జీబీ ఇన్ బుల్ట్ మెమరీని 32జీబీకి వృద్ధి చేసుకోవచ్చు. మార్కెట్లో విడుదలైన బీటెల్ మ్యాజిక్, రిలయన్స్ 3జీ టాబ్లెట్ పీసీలతో పోలిస్తే విడుదల కానున్న ‘ఎమ్’ ట్యాబ్ అత్యుత్తమ మన్నిక కలిగి ఉంటుందని బ్రాండ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ పీసీలో పొందుపరిచిన హెడ్డీఎమ్‌ఐ పోర్టును, హెచ్‌డీ టీవీకి అనుసంధానం చేసుకోవచ్చు.

ఈ గ్యాడ్జెట్‌లో పొందుపరిచిన అధునాతన కనెక్టువిటీ వ్యవస్థ, ఇంటర్నెట్ తదితర ప్రచార సాధానాలను వినియోగదారునుకి వేగవంతంగా చేరవేస్తుంది. 3జీ వ్యవస్థతో పాటు వై - ఫై వ్యవస్థకు ఈ తేలికైన టాబ్లెట్ సహకరిస్తుంది. టాబ్లెట్‌లోని 1.3 మెగా పిక్సల్ కెమెరా వీడియో కాలింగ్‌కు సహకరిస్తుంది. పొందుపరిచిన మల్టీ ఫార్మాట్ ఆప్లికేషన్ నాణ్యమైన ఆడియో, వీడియో ప్లేయర్లను వినియోగదారునికి అందిస్తుంది. అమర్చిన 4000 mAh బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలిక మన్నిక కలిగి ఉంటుంది.

సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ‘మెర్క్యురీ’ ఇండియా మేనేజర్ సుష్మితా దాస్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సైతం అధునాతన పరిజ్ఞానాన్ని అందించే క్రమంలో టాబ్లెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. సెప్టంబర్ 1న దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ దుకాణాల్లో ‘ఎమ్’ టాబ్లెట్ పీసీలు విడుదల కానున్నాయి. ధర విషయానికొస్తే ఒక్కో టాబ్లెట్ పీసీ ధర కేవలం రూ.9,499 మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot