కోబియన్ నుంచి డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్
ప్రముఖ ట్యాబ్లెట్ కంప్యూటర్ల తయారీ బ్రాండ్ కోబియన్, 'మెర్క్యురీ ఎంట్యాబ్ స్ట్రీక్యూ డ్యుయో ట్యాబ్లెట్' పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ట్యాబ్లట్ ధరను కంపెనీ అధికారికంగా వెలువరించనప్పటికి, ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇన్ఫిబీమ్ ఈ డివైజ్‌ను రూ.10,049కు ఆఫర్ చేస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
కోబియన్ కొత్త ట్యాబ్లెట్ 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ మల్టీటచ్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది (రిసల్యూషన్ సామర్ధ్యం 1024 x 600పిక్సల్స్). 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ మీడియా టెక్ ఎంటీ8577 ప్రాసెసర్‌ను ట్యాబ్లెట్‌లో నిక్షిప్తం చేయటం జరిగింది. వేగవంతమైన మల్టీటాస్కింగ్ కొరకు 1జీబి డీడీఆర్3 ర్యామ్‌ను ట్యాబ్‌లో పొందుపరిచారు. డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ స్లాట్ సామర్ధ్యాన్ని కలిగి ఉన్న ఈ ట్యాబ్లెట్‌లో 2జీ ఇంకా 3జీ సిమ్‌లను వినియోగించుకోవచ్చు. పొందుపరిచిన వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లు ట్యాబ్లెట్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. కెమెరా వెనుక భాగంలో 2 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను, ముందు భాగంలో 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. స్ట్రీక్యూ డ్యుయో ట్యాబ్లెట్ 8జీబి ఇంటర్నల్ మెమెరీ వ్యవస్థను కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 32జీబికి విస్తరించుకునే అవకాశం. ట్యాబ్లెట్ బరువు 320 గ్రాములు, శక్తివంతమైన 3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థు పై ట్యాబ్లెట్ రన్ అవుతుంది.
మెర్క్యురీ ఎంట్యాబ్ స్ట్రీక్యూ డ్యుయో ట్యాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లు:
7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ8577 ప్రాసెసర్,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ స్లాట్ (2జీ+3జీ),
వై-ఫై, బ్లూటూత్ 3.0, జీపీఎస్ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,
3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








