మెర్క్యురీ ‘mTab2’ మార్కెట్లోకి ఎంట్రీ!!!

Posted By: Prashanth

మెర్క్యురీ  ‘mTab2’ మార్కెట్లోకి ఎంట్రీ!!!

 

మెర్క్యురీ ‘mTab’కు అప్ డేటెడ్ వర్షన్ గా ‘mTab2’ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. సంవత్సరం వారంటీతో రూ.12,000లకే లభ్యమవున్న ఈ టాబ్లెట్ ఉత్తేజకరమైన లక్షణాలను ఒదిగి ఉంది. అవేంటో మీరు ఓ లుక్ వేయండి...

యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ వోఎస్ ఈ టాబ్లెట్ రన్ అవుతుంది. లోడ్ చేసిన్ డ్యూయల్ కోర్ 1 GHz ప్రాసెసర్ డివైజ్ పని సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తుంది. 7 అంగుళాల మల్టీ టచ్ డిస్ ప్లే క్లారిటీతో కూడిన విజువల్ అనుభూతిని కలిగిస్తుంది. డివైజ్ ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి.. ముఖ్యమైన డేటాను స్టోర్ చేసుకునేందుకు తోడ్పడుతుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా జీబిని 32కు పెంచుకోవచ్చు. ఏర్పాటు చేసిన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లైవ్ వీడియో ఛాటింగ్ కు తోడ్పడుతుంది. బ్యాటరీ బ్యాకప్ 8 గంటలు. టాబ్లెట్ ను హైడెఫినిషన్ టీవీలకు జత చేసుకునే విధంగా హెచ్డీఎమ్ఐ పోర్ట్ ను టాబ్లెట్ లో అమర్చారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot