హాట్ సమ్మర్‌లో కూల్ ఎంటర్‌టైనర్!!

Posted By: Staff

 హాట్ సమ్మర్‌లో కూల్ ఎంటర్‌టైనర్!!

 

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీ సంస్థ మెర్క్యురీ దేశీయ విపణిలో సరికొత్త స్మార్ట్ టాబ్లెట్‌‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పని చేసే ఈ కంప్యూటింగ్ డివైజ్ అత్యుత్తమ ఫీచర్లను ఒదిగి ఉంది. ఈ అంశానికిసంబంధించి మెర్క్యురీ ఇండియా మేనేజర్ సుష్మితా దాస్ స్పందిస్తూ మార్చి నాటికి దేశంలోని ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో ఈ టాబ్లెట్ పీసీ లభ్యమవుతుందని స్పష్టం చేశారు.

ముఖ్య ఫీచర్లు:

* 7 అంగుళాల టచ్ స్ర్కీన్,

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* శక్తివంతమైన 1 GHz ప్రాసెసర్,

* 3జీ కనెక్టువిటీ,

* టాబ్లెట్ ను ఒకే తడవలో 6 డివైజ్ లకు కనెక్టు చేసుకునేవిధంగా ఇంటిగ్రేటెడ్ వై-ఫై రూటర్,

* డిడిఆర్3 మెమరీ.

ప్రచార ముమ్మరం:

వ్యాపారాన్ని వ్ళద్థి చేసే క్రమంలో మెర్క్యురీ దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తుంది. మార్కెట్లో బలంగా పాతకుపోయేందుకు వివిధ కార్యకలపాలు నిర్వహిస్తుంది. త్వరలో 10 అంగుళాలో వేరియంట్ లో టాబ్లెట్ ను విడుదల చేస్తున్నట్లు సంస్థ వర్గాలు ప్రకటించాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot