మైక్రోమ్యాక్స్ నుంచి సరికొత్త వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ ‘కాన్వాస్ ట్యాబ్ పీ650’

Posted By:

మైక్రోమ్యాక్స్ నుంచి సరికొత్త వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ ‘కాన్వాస్ ట్యాబ్ పీ650'  ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ తన కాన్వాస్ సిరీస్ నుంచి ‘ట్యాబ్ పీ650' పేరుతో మొట్టమొదటి వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ పీసీని మైక్రోమ్యాక్స్ గురువారం ఆవిష్కరించింది. ధర రూ.16,500. ఈ ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లతో పాటు దేశంలోని ప్రముఖ రిటైల్ స్టోర్లు విక్రయిస్తున్నాయి.

కాన్వాస్ ట్యాబ్ పీ650 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

8 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1024× 768పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల బ్రౌజింగ్ టైమ్).

ట్యాబ్లెట్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే: వాయిస్ కాలింగ్, సిమ్ కార్డ్‌స్లాట్, 3జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్.

కాన్వాస్ ట్యాబ్ పీ65, ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. వీడియో పిన్నింగ్, పాప్-అప్ బ్రౌజర్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. మరోవైపు స్పుల్, ఎమ్! సెక్యూరిటీ, మ్యూజిక్ హబ్, ఒపెనా మినీ వంటి అప్లికేషన్‌లను కాన్వాస్ ట్యాబ్ పీ65లో ముందస్తుగా లోడ్ చేయటం జరిగింది.  కాన్వాస్ ట్యాబ్ పీ65 బ్లూ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమ్యాక్స్ నుంచి సరికొత్త వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ ‘కాన్వాస్ ట్యాబ్ పీ650’

మైక్రోమ్యాక్స్ నుంచి సరికొత్త వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ ‘కాన్వాస్ ట్యాబ్ పీ650’


మైక్రోమ్యాక్స్ నుంచి సరికొత్త వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ ‘కాన్వాస్ ట్యాబ్ పీ650'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting