బిజీ బిజీ మైక్రోమ్యాక్స్ నుంచి సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్!

వరుస ఆవిష్కరణలతో టెక్ మార్కెట్లో సందడి వాతావరణాన్ని సృష్టిస్తున్న మైక్రోమ్యాక్స్ తాజాగా ‘మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ’ పేరుతో సరికొత్త తక్కువ ధర టాబ్లెట్ కంప్యూటర్‌ను లాంచ్ చేసింది. ధర రూ.6,999. ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే ఈ కంఫర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ ఫీచర్లు క్లుప్తంగా........
బరువు ఇంకా చుట్టుకొలత: టాబ్లెట్ బరువు 360 గ్రాములు, శరీర పరిమాణం 122 x 192 x 10మిల్లీమీటర్లు,
డిస్ ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మెమరీ: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512 ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ: వై-ఫై, 3జీ వయా డాంగిల్,
బ్యాటరీ: 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల బ్యాకప్),
ఇతర ఫీచర్లు: ఇన్‌బుల్ట్ అప్లికేషన్స్ (ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, గేమ్స్), ప్రీలోడెడ్ ఆడోబ్ ఫ్లాష్ ప్లేయర్, 2 ప్రీలోడెడ్ పూర్తి నిడివి సినిమాలు,
ధర ఇతర వివరాలు: మైక్రోమ్యాక్స్ ఈ-స్టోర్ ఇంకా ప్రముఖ రిటైల్ అవుట్ లెట్‌లలో ఈ టాబ్లెట్ లభ్యమవుతుంది. ధర రూ.6,999.


Click it and Unblock the Notifications