మైక్రోమ్యాక్స్ vs సెల్‌కాన్ (తక్కువ ధర టాబ్లెట్ కంప్యూటర్‌ల యుద్ధం)

By Prashanth
|

మైక్రోమ్యాక్స్ vs సెల్‌కాన్ (తక్కువ ధర టాబ్లెట్ కంప్యూటర్‌ల యుద్ధం)

 

దేశీయ టాబ్లెట్ తయారీ సంస్థలు మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్‌ల మధ్య తక్కువ ధర టాబ్లెట్ కంప్యూటర్ల యుద్దం నెలకుంది. తాజాగా ఈ రెండు బ్రాండ్‌లు సరికొత్త టాబ్లెట్ పీసీలను మార్కెట్లో ఆవిష్కిరంచాయి. వీటిలో మైక్రోమ్యాక్స్ టాబ్లెట్ ఫన్‌బుక్ ఇన్ఫినిటీ ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతుంగా సెల్‌కాన్ రూపొందించిన టాబ్లెట్ సెల్‌ట్యాబ్ సీటీ2 అక్టోబర్‌లో అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే ఈ రెండు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై విశ్లేషణ...

బరువు ఇంకా చుట్టుకొలత:

ఫన్‌బుక్ ఇన్ఫినిటీ: శరీర పరిమాణం 122 x 192 x 10మిల్లీమీటర్లు, బరువు 360 గ్రాములు,

సెల్‌ట్యాబ్ సీటీ2: వివరాలు తెలియాల్సి ఉంది.

డిస్‌ప్లే:

ఫన్‌బుక్ ఇన్ఫినిటీ: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

సెల్‌ట్యాబ్ సీటీ2: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్:

ఫన్‌బుక్ ఇన్ఫినిటీ: 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

సెల్‌ట్యాబ్ సీటీ2: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

ఫన్‌బుక్ ఇన్ఫినిటీ: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

సెల్‌ట్యాబ్ సీటీ2: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

ఫన్‌బుక్ ఇన్ఫినిటీ: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

సెల్‌ట్యాబ్ సీటీ2: వీజీఏ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్:

ఫన్‌బుక్ ఇన్ఫినిటీ: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

సెల్‌ట్యాబ్ సీటీ2:4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

కనెక్టువిటీ:

ఫన్‌బుక్ ఇన్ఫినిటీ: వై-ఫై, 3జీ వయా డాంగిల్,

సెల్‌ట్యాబ్ సీటీ2: వై-ఫై, 3జీ వయా డాంగిల్, మొబైల్ సిమ్‌కార్డ్ స్లాట్,

బ్యాటరీ:

ఫన్‌బుక్ ఇన్ఫినిటీ: 4000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (6గంటల బ్రౌజింగ్ టైమ్),

సెల్‌ట్యాబ్ సీటీ2: 3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర:

ఫన్‌బుక్ ఇన్ఫినిటీ: రూ.6,999.

సెల్‌ట్యాబ్ సీటీ2:7,499.

తీర్పు:

ఈ రెండు డివైజ్‌లలో హార్డ్‌వేర్ ఇంకా వోఎస్‌లు సమాన సామర్ధ్యాన్ని కలిగి ఉన్నప్పటికి సాఫ్ట్‌వేర్ ఫీచర్ల విషయంలో తేడాలను గమనించవచ్చు. ఫన్‌బుక్ ఇన్ఫినిటీ‌లో లోడ్ చేసిన ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, గేమ్స్ అప్లికేషన్స్, ప్రీలోడెడ్ ఆడోబ్ ఫ్లాష్ ప్లేయర్,

రెండు ప్రీలోడెడ్ పూర్తి నిడివి సినిమాలు వంటి అంశాలు పూర్తి స్థాయి వినోదాన్ని నింపుతాయి. సెల్ ట్యాబ్‌లో ఏర్పాటు చేసిన మొబైల్ సిమ్‌కార్డ్ స్లాట్, లైవ్‌ టీవీ అప్లికేషన్ ప్రత్యేకంగా ఆకట్టకుంటుంది. కంప్యూటింగ్‌తో పాటు మొబైలింగ్ అనుభూతులను కోరుకునే వారికి సెల్ ట్యాబ్ సీటీ2 ఉత్తమ ఎంపిక. మరోవైపు సమంజసమైన ధర, మన్నికైన బ్యాటరీ బ్యాకప్, వేగవంతమైన ప్రాసెసింగ్, రేర్ కెమెరా సౌలభ్యతలను కోరుకునే వారికి ఫన్‌బుక్ ఇన్ఫినిటీ బెటర్ ఆప్షన్.

Read In English

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X