మైక్రోమాక్స్ ఫన్‌బుక్ పీ365@రూ.6,749
బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ పీసీల మార్కెట్‌ను టార్గెట్ చేసిన మైక్రోమాక్స్ 'ఫన్‌బుక్ పీ365' (Funbook P365) పేరుతో సరికొత్త వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ధర రూ.6,749. ప్రస్తుతం ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్ డివైస్‌ను మైక్రోమ్యాక్స్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ micromaxestore ద్వారా విక్రయిస్తున్నారు.

ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు అనువుగా పెద్దదైన తెర, వాయిస్ కాలింగ్ నిర్వహించుకునేందుకు సింగిల్ సిమ్ స్లాట్, కాలింగ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, మల్టీ టాస్కింగ్‌కు 1జీబి ర్యామ్, 1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ Rockchip ప్రాసెసర్ వంటి అధునాత ప్రత్యేకతలను ఈ డివైస్‌లో పొందుపరిచారు.
మైక్రోమాక్స్ ఫన్‌బుక్ పీ365 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
సింగిల్ సిమ్,
7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్800x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ Rockchip ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ,
2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








