అబ్బా.... పర్సనాలిటీ కేక!

Posted By: Prashanth

అబ్బా.... పర్సనాలిటీ కేక!

 

దేశీయ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ ఇటీవల ఆవిష్కరించిన రెండు టాబ్లట్ పీసీలలో ‘మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ప్రో’ఒకటి. శక్తివంతమైన కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్‌తో రూపొందిన ఈ డివైజ్ మల్టీమీడియా, గేమింగ్ అవసరాలను తీర్చటంలో మెరుగైన పనితీరును కనబరుస్తుంది.

టాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లు:

10 అంగుళా టీఎఫ్‌టీ మల్టీ టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),

గుగూల్ ఆండ్రాయిడ్ వీ4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.2గిగాహెట్జ్)

1జీబి ర్యామ్,

డ్యూయల్ మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసర్,

8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

మెమరీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

3జీ డాంగిల్ సపోర్ట్,

హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,

బ్లూటూత్, వై-ఫై,

ధర అంచనా రూ.6,500.

పెద్దదైన స్ర్కీన్ వీడియోలు తిలకించేందుకు మరింత అనువుగా ఉంటుంది. ఈ-బుక్ రీడర్ అప్లికేషన్ మరో ప్రత్యేకత.1.2గిగాహెట్జ్ క్లాక్ వేగాన్ని కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్ 1జీబి ర్యామ్ సహకారంతో టాబ్లెట్ పనితీరును మరింత వేగిరితం చేస్తుంది. లోడ్ చేసిన ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌ను యూజర్‌కు అందిస్తుంది. టాబ్లెట్ మెమరీని 32జీబి వరకు పొడిగించుకోవచ్చు. నిక్షిప్తం చేసిన డ్యూయల్ మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసర్ ఉత్తమమైన గ్రాఫిక్ అనుభూతులను చేరువ చేస్తుంది. టాబ్లెట్ ముందుభాగంలో అమర్చిన వీజీఏ కెమెరా మన్నికతో కూడిన ప్రత్యక్ష వీడియో చాటింగ్‌ను అందిస్తుంది. ఏర్పాటు చేసిన హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ సౌలభ్యతతో పీసీని హైడెఫినిషన్ టీవీలకు జత చేసుకోవచ్చు. టాబ్లెట్ విడుదలకు సంబంధించి ఖచ్చితమైన తేదీని మైక్రోమ్యాక్స్ ప్రకటించలేదు. ధర అంచనా రూ.6,500. సిల్వర్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో మైక్రోమ్యాక్ప్ ఫన్‌బుక్ ప్రో లభ్యం కానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot