మైక్రోమ్యాక్స్ Vs కార్బన్, ఎవరికి మీ ఓటు?

Posted By: Staff

మైక్రోమ్యాక్స్ Vs కార్బన్, ఎవరికి మీ ఓటు?

దేశీయ గ్యాడ్జెట్ నిర్మాణ రంగంలో క్రీయాశీలకపాత్ర పోషిస్తున్న మైక్రోమ్యాక్స్ అదేవిధంగా కార్బన్‌లు తాజాగా రెండు టాబ్లెట్ పీసీలను మార్కెట్‌కు పరిచయం చేసాయి. మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ప్రో, కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 2 మోడళ్లలో వేరు వేరు ధర శ్రేణుల్లో విడుదలైన ఈ గ్యాడ్జెట్‌లు ఆకట్టకునే స్పెసిఫికేషన్ లను ఒదిగి ఉన్నాయి. వీటి ఎంపిక పై కొనుగోలుదారు ఖచ్చితమైన అవగాహనకు వచ్చే విధంగా ఈ రెండు కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ల పై విశ్లేషణ...

డిస్‌ప్లే: మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ప్రో పెద్దదైన 10.1 అంగుళాల టచ్ స్ర్కీన్. డిస్‌ప్లే రిసల్యూషన్ సామర్ధ్యం 1024 x 600పిక్సల్స్ . మరో వైపు కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 7 అంగుళాల సమర్థవంతమైన టచ్ స్ర్కీన్‌ను ఒదిగి ఉంటుంది. డిస్‌ప్లే రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్.

ఆపరేటింగ్ సిస్టం: వోఎస్ విషయంలో ఈ రెండు డివైజ్‌లు సమాన వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై ఇవి రన్ అవుతాయి. అయితే, స్మార్ట్‌ట్యాబ్ 2 త్వరలో ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ వోఎస్‌కు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశముంది.

ప్రాసెసర్: ఫన్‌బుక్ ప్రోలో 1.2గిగాహెర్జ్ సామర్ధ్యం గల కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేశారు. స్మార్ట్ ట్యాబ్‌లో 1.2గిగాహెర్జ్ ఎక్స్‌బరస్ట్ ప్రాసెసర్‌ను వినియోగించారు.

కెమెరా: ఈ రెండు పీసీలలో ప్రధాన కెమెరా వ్యవస్థ లోపించింది. స్మార్ట్‌ట్యాబ్ 2, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కమెరాను కలిగి ఉండగా ఫన్‌బుక్ ప్రో వీజీఏ ఫ్రంట్ కెమెరాతో సరిపెట్టకుంది.

స్టోరేజ్: ఫన్‌బుక్ ప్రో 8జీబి ఫ్లాష్ మెమెరీతో పాటు 1జీబి ర్యామ్ వ్యవస్థను కలిగి ఉంది. స్మార్ట్‌ట్యాబ్ 2 4జీబి మెమరీతో పాటు 512 ఎంబీ ర్యామ్‌ను ససోర్ట్ చేస్తుంది. అయితే మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌజన్యంతో ఈ రెండు పీసీల్లోని మెమెరీని 32జీబికి పొడిగించుకోవచ్చు.

కనెక్టువిటీ ఫీచర్లు:

ఫన్‌బుక్ ప్రో: వై-ఫై, 3జీ వయా డాంగిల్,

స్మార్ట్ ట్యాబ్ 2: వై-ఫై, బ్లూటూత్, 3జీ వయా డాంగిల్,

ధర:

ఫన్‌బుక్ ప్రో మార్కెట్ ధర రూ.9,999 కాగా, కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 2 ధర రూ.6,999.

తీర్పు:

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్‌కు సక్సెసర్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టిన మైక్రోమ్యాక్స్ ఫన్ బుక్ ప్రో విద్యా సంబంధిత అప్లికేషన్‌లను ఇమిడి ఉంది. వీటి సౌలభ్యతతో విద్యార్థులు తమ విద్యా నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవచ్చు. కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 2 త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్కు అప్‌గ్రేడ్ కావటం శుభపరిణామంగా భావించవచ్చు. ఫన్‌బుక్ ప్రోతే పోలిస్తే కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 2 ధర తక్కువ. ప్రస్తుత పరిస్థితులు, అవసరాల దృష్ట్యా వినియగదారు ‘ఫన్ బుక్ ప్రో’కే ఎక్కువ మద్దతు పలికే అవకాశముంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot