టాబ్లెట్ యుద్ధం... మైక్రోమ్యాక్స్ Vs జెన్!

Posted By: Super

టాబ్లెట్ యుద్ధం... మైక్రోమ్యాక్స్ Vs జెన్!

 

 

దేశీయ మార్కెట్లో ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లకు అనూహ్య రీతిలో డిమాండ్ పెరుగుతోంది. దింతో దేశవాళీ సంస్థలైన మైక్రోమ్యాక్స్, కార్బన్, జెన్, వైకిడ్‌లీక్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీలను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఈ తరహాలోనే ఇటీవల విడుదలైన మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్, జెన్ అల్ట్రాట్యాబ్ ఏ100ల మధ్య పోటీ మార్కెట్ నెలకుంది. స్పెసిఫికేషన్స్ అలానే ధర విషయంలో ఈ గ్యాడ్జెట్‌లు నువ్వా...నేనా అంటు పోటీపడుతున్నాయి.

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ప్రో కీలక స్పెసిఫికేషన్‌లు:

10 అంగుళాల టీఎఫ్‌టీ మల్టీ టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),

గుగూల్ ఆండ్రాయిడ్ వీ4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.2గిగాహెట్జ్)

1జీబి ర్యామ్,

డ్యూయల్ మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసర్,

8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

మెమరీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,

0.3 ఫ్రంట్ కెమెరా,

3జీ డాంగిల్ సపోర్ట్,

హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,

వై-ఫై,

5,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.9,999.

జెన్ అల్ట్రాట్యాబ్ ఏ100 కీలక ఫీచర్లు:

చుట్లుకొలత 181.5 x 121 x 10.5 మి.మీ, బరువు 295 గ్రాములు,

7 అంగుళాల టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.2గిగాహెర్జ్ ప్రాసెసర్,

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

512ఎంబీ ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

వై-ఫై,

డాంగిల్ సపోర్ట్‌తో 3జీ కనెక్టువిటీ,

2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.6,199.

మీ అవసరాలను బట్టి ఈ టాబ్లెట్‌లలో ఏది ఉత్తమమైనదో మీరే నిర్ణయించుకోవల్సి ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot